టాలీవుడ్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎంఎం కీరవాణి కూడా ఒకరు. ఒకప్పటి నుండి ఇప్పటి వరకూ కీరవాణి టాప్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు కీరవాణినే స్వరాలు సమకూరుస్తుంటారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.
Advertisement
అదే విధంగా మగధీర, బాహుబలి,ఈగ సినిమాలలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక రాజమౌళి కి కీరవాణి వరసకు అన్న అవుతారన్న సంగతి తెలిసిందే. ఇక కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాలలో మాతృదేవోభవ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా థియేటర్ లలో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
Advertisement
ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో సినిమా ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. ముఖ్యంగా సినిమాలోని రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ పాటను వింటే కన్నీళ్లు ఆగవు. అయితే ఈ పాటకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీలలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు ఈ పాట అంటే చాలా ఇష్టమట.
అతడికి ఎప్పుడు మనసు బాగోలేకపోయినా ఈ పాటను వింటారట. ఈ విషయాన్ని కీరవాణి ఓ ఇంటర్య్వూలో చెప్పారు. దాంతో కీరవాణి ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఆ పాటను రికార్డ్ చేసి ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చారట. అంతే కాకుండా మీ ముందు తప్ప మరెక్కడా ఆ పాటను పాడను అని కీరవాణి ఎన్టీఆర్ కు మాట కూడా ఇచ్చారట. దాంతో కీరవాణి ఎన్టీఆర్ కు ఇచ్చిన మాటతో ఆ పాటను ఎవరు అడిగినా తన నోట పాడను చెప్పారు.