సమాజం చాలా దారుణంగా తయారవుతోంది.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. మన సొంత నీడనే నమ్మే పరిస్థితి లేకుండా తయారయింది.. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువైపోయారు.. నీచాతి నీచమైన పనులకు దిగజారుతున్నారు.. మరి ఇలాంటి పనులు చేసేది చదువులేని వ్యక్తులు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. దేవాలయం లాంటి యూనివర్సిటీలో చదువుకుంటూ ఆడదానికి ఆడదే శత్రువు అనే విధంగా.. ఆ విద్యార్థిని చేసిన పనికి లోకమంతా ఛీ అంటోంది.. సభ్య సమాజం తలదించుకునేలా తోటి స్నేహితులకు వెన్నుపోటు పొడిచింది ఆ ప్రబుద్దురాలు.. మరి పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం..
Advertisement
also read:అక్కినేని ఫ్యామిలీ లో చైతూ లానే మరో వారసుడు….? కానీ ఆ కారణం వల్లే సినిమాల్లోకి రావడం లేదట…!
Advertisement
పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో దారుణం జరిగింది.. చండీగర్ యూనివర్సిటీకి చెందిన 60 మంది విద్యార్థులు బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోలు అనూహ్యంగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.. ఈ ఘటనతో ఒక్కసారిగా యూనివర్సిటీలో కలకలం రేగింది.. మరి ఇంతకీ ఆ వీడియోలు సోషల్ మీడియాకి ఎలా వచ్చాయి అనేది చూస్తే.. ఆ వీడియోలు తీసింది కూడా ఆ విద్యార్థులలో ఉండే ఒక అమ్మాయి.. ఆమె స్నేహితులు బాత్రూంలో స్నానం చేస్తుండగా ఈ వీడియోలు తీసి తన బాయ్ ఫ్రెండ్ కు ఎంచక్కా పంపించేది.. దీంతో ఆ నీచుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.. ఈ తతంగం గత కొద్ది రోజులుగా సాగుతోందట..
వారి వీడియోలను సోషల్ మీడియాలో ఆ విద్యార్థినులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం కూడా చేశారు. వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించి వారిని ఆస్పత్రికి తరలించగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మిగతా వాళ్లకు చికిత్స అందిస్తున్నారు.. ఈ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వారికి న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు..
also read: