Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 18.09.2022 నుండి 24.09.2022 వరకు

మేషం :

Mesha

Mesha

త‌ల‌పెట్టిన కార్యాలు స‌కాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్న‌త ఫ‌లితం ఉంటుంది. మీ ఆశ‌యం నెర‌వేరుతుంది. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకోగ‌లుగుతారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందిస్తారు. ప్ర‌యాణాలు క‌లిసి వ‌స్తాయి.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

శ‌త్రువుపై విజ‌యం సాధిస్తారు. ఆలోచ‌న‌లు శ‌క్తిని ఇస్తాయి. స‌కాలంలో ప‌నులు పూర్తి చేయాలి. కుటుంబ స‌భ్యుల‌కు శ్ర‌మ క‌లుగుతుంది. స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లాలి. తొంద‌ర‌పాటు ప‌నికి రాదు. ఒత్తిడి క‌లిగించే ప‌రిస్థితులకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో శ్ర‌ద్ధ పెంచాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

త‌ల్లి త‌ర‌పు పెద్ద‌ల అండ‌తో విజ‌యం సాధిస్తారు. ఉద్యోగంలో స‌మ‌య‌స్పూర్తితో సానుకూల ఫ‌లితం వ‌స్తుంది. వ్యాపారంలో విశేష శుభ‌యోగం ఉంది. స‌కాలంలో స్పందించడం ముఖ్యం. ప్ర‌శాంత‌చిత్తంతో ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. మీ వ‌ల్ల స‌మాజానికి మేలు జ‌రుగుతుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

అదృష్ట‌కాలం న‌డుస్తోంది. ఎటు చూసినా శుభ‌మే గోచ‌రిస్తోంది. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. ధ‌ర్మ దేవ‌తానుగ్ర‌హం క‌లుగుతుంది. ఆగిన ప‌నులు ఇప్ప‌డు పూర్తి అవుతాయి. ప్ర‌య‌త్నం బ‌లంగా ఉండాలి. బంధు మిత్ర స‌మాగ‌మంతో నూత‌నోత్సాహం క‌లుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. చంచ‌ల‌త్వం ప‌నికి రాదు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

దృడ‌సంక‌ల్పంతో ముందుకు వెళ్లండి. బుద్ధిబ‌లంతో వ్యాపార విజ‌యం ల‌భిస్తుంది. ప‌లు మార్గాల్లో లాభ‌ప‌డ‌తార‌. సంప‌ద పెరుగుతుంది. గృహ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లమ‌వుతాయి. ఎదురుచూస్తున్న ప‌ని ఒక‌టి అవుతుంది. స‌మిష్టి నిర్ణ‌యాలు శ‌క్తినిస్తాయి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

 

ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. ప‌లు అవ‌రోధాలు ఉంటాయి. చంచ‌ల‌త్వం వ‌ల్ల స‌మ‌స్య పెరుగుతుంది. ఉద్యోగంలో గంభీరంగా వ్య‌వ‌హ‌రించాలి. క్ర‌మంగా స‌మ‌యం అనుకూలిస్తుంది. చెడు ఊహించ‌వ‌ద్దు. స‌మిష్టి కృషి కార్య‌సిద్ధినిస్తుంది. కొంద‌రి వ‌ల్ల విచారం క‌లుగ‌వ‌చ్చు. వ్యాపారంలో న‌ష్టం రానివ్వ‌ద్దు.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ముఖ్య కార్యాల్లో శ్ర‌ద్ధ వ‌హించాలి. కాలం వ్య‌తిరేకంగా ఉంది. అడుగ‌డుగునా తెలియ‌ని విఘ్నాలు ఎదురు అవుతాయి. అధికారుల ఒత్తిడి ఉంటుంది.సున్నిత అంశాల్లో లోతుగా ఆలోచించ‌వ‌ద్దు. వ్యాపార దోషం. అప్ర‌మ‌త్తంగా ఉంటూనే సంతృప్తి క‌లిగే వ‌ర‌కు శ్ర‌మిస్తూనే ఉండాలి. వారాంతంలో మంచి విజ‌యం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

అదృష్ట‌వంతులు అవుతారు. విశేష కార్య‌సిద్ధి, ధ‌న లాభం క‌లుగుతుంది. ఇంట్లో శుభం జ‌రుగుతుంది. ఉద్యోగం సానుకూలంగా ఉంటుంది. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించండి. సుఖ సౌభాగ్యాలు ఉంటాయి. బంధువుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. స్వ‌స్థాన ప్రాప్తిసిద్ధిస్తుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో ప‌దోన్న‌తి లభిస్తుంది. గతం క‌న్నా మంచి ఫ‌లితాలు సాధిస్తారు. స్థిర‌బుద్ధితో చేసే ప్ర‌య‌త్నం విజ‌యాన్ని ఇస్తుంది. దేనికి కూడా వెనుకాడ వ‌ద్దు. ధ‌ర్మ‌మార్గంలో ప‌య‌నించండి. అవ‌రోధాలు తొలుగుతాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. స‌మ‌యానుకూల నిర్ణ‌యాలు క‌లిసి వ‌స్తాయి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

మంచి మ‌నసుతో ప‌ని ప్రారంభించండి. తెలియ‌ని ఆటంకం ఉన్నా ల‌క్ష్యాన్ని చేర‌గ‌ల‌రు. ఉద్యోగంలో శ్ర‌ద్ధ పెంచండి. ప్ర‌ణాళిక‌తో ప‌ని చేస్తే ఒత్తిడిని త‌గ్గించుకోవచ్చు. తోటివారి ప్రోత్సాహం ల‌భిస్తుంది. చిత్త‌శుద్ధి ర‌క్షిస్తుంది. ఆప‌ద‌లు తొల‌గుతాయి. శాంత చిత్తంతో ఆలోచించాలి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అనేక విఘ్నాలు ఉన్నాయి. అప్ర‌మ‌త్తంగా ముందుకు వెళ్లాలి. ఆప‌దలు చుట్టుముడుతాయి. ప‌రిస్థితులు స‌హ‌క‌రించడం లేదు. గత అనుభ‌వం కాపాడుతుంది. ఉద్యోగం ప‌ర్వాలేదు. వ్యాపారంలో ఇబ్బందులు త‌లెత్తుతాయి. ఈర్ష్యాప‌రుల నుంచి నింద‌లు ఎదురు అవుతాయి. వారం మ‌ధ్య‌లో ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగం అనుకూలం. ఓర్పు చాలా అవ‌స‌రం. సంతానం వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు స‌మ‌కూరుతాయి. ప్ర‌తీ అడుగు జాగ్ర‌త్త‌గా వేయాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మొహ‌మాటం ప‌నికి రాదు. వ్యాపారంలో బాగా క‌ష్ట‌ప‌డాలి. వారాంతంలో మంచి జ‌రుగుతుంది.

Also Read :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి గ‌ల‌ మ‌హిళ‌లు శుభ‌వార్త‌లు వింటారు

Visitors Are Also Reading