సినిమా వాళ్ల జీవితాలు బయటకు కలర్ ఫుల్ గా కనిపిస్తాయి కానీ నిజానికి వారి జీవితాల్లో కూడా సాధారణ ప్రజల మాదిరిగానే చెప్పుకోలేని విషాదాలు ఉంటాయి. అలానే నువ్వునాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా నటించిన పింకీ అసలు పేరు సుదీప జీవితంలోనూ చెప్పుకోలేని విషాదం ఉంది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో సుదీప ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
అల్లరి పిల్లగా ఈ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత చాలా సినిమాలలో నటించింది. అంతే కాకుండా సీరియల్స్ లోనూ నటించింది. కాగా రీసెంట్ మొదలైన బిగ్ బాస్ సీజన్ 6లోకి సుధీప ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రీసెంట్ ఎపిసోడ్ లో తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన నిజాలను బయటపెట్టింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని దాని కోసం అందరి దీవెనలు కావాలని కంటతడి పెట్టుకుంది.
Advertisement
తనకు పెళ్లి తరవాత 2015 లో ప్రెగ్నెన్సీ వచ్చిందని అప్పుడే ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ రావడం తాను జీవితంలో స్థిరపడకపోవడం వల్ల అప్పుడే పిల్లలు వద్దనుకున్నట్టు తెలిపింది. ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ చేసి వచ్చిన తరవాత ప్రెగ్నెన్సీ తీయించుకున్నట్టు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అప్పడెందుకో అంత అటాచ్ మెంట్ లేదని మూడు సంవత్సరాల తరవాత జీవితంలో స్థిరపడ్డామని చెప్పింది.
ఆ తరవాత అందరూ పిల్లలు అంటే చాలా ప్రయత్నించినట్టు తెలిపింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ మూడు నెలలలో అబార్షన్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో తైరాయిడ్ లెవల్స్ పెరిగాయని చాలా ఆందోళన చెందానని చెప్పింది. చాలా మంది వైద్యులను కలిసామని సమస్య లేదని చెబుతున్నారని తెలిపింది. కానీ ఏళ్లు గడిచేకొద్దీ నమ్మకం పోతోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సుదీప కన్నీళ్‌లు పెట్టుకోవడంతో హౌస్ మేట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.