టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా అనేది చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనేది తాజాగా ఆరంభం అయ్యింది. ఈ విషయాన్ని ఓ విడి ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటె మహేష్ బాబు హీరోగా చివరగా వచ్చిన సర్కారు వారు పాట అనే సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అయితే కాలేదు.
Advertisement
దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ తీస్తున్న సినిమా పై మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క రిజల్ట్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడే ఆలోచనలో పడ్డారు అని తెలుస్తుంది. అందుకు కారణం ఈ సినిమాలో మహేష్ బాబును డైరెక్టర్ త్రివిక్రమ్ పోలీస్ ఆఫిసర్ గా చూపించబోతున్నాడు అని తెలుస్తుంది.
Advertisement
ఇక మహేష్ బాబు గతంలో పోలీస్ గా చేసిన సినిమాలు హిట్ అయినా.. ఆయన ఆఖరిగా పోలీస్ గా నటించిన ఆగడు సినిమా పెద్ద డిజాస్టర్ గా మారిపోయింది. దాంతో మళ్ళీ మహేష్ బాబు పోలీస్ డ్రెస్ వేస్తున్నాడు అనే వార్త ప్రచారం అవుతున్న సమయం నుండి ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను వచ్చే నెల ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు అని తెలుస్తుంది. కాబట్టి దీని ఫలితం ఎలా ఉంటుందో అప్పుడే మనం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :