సాక్షాత్తు దైవ స్వరూపుడు అయినటువంటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో జరుగబోయే వింతలను భవిష్యత్‌ని తన మనో నేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పినవన్నీ చాలా జరిగాయి. మరెన్నో ఘటనలు భవిష్యత్‌లో జరుగబోతున్నాయి. బ్రాహ్మణులు తమ కులవృత్తులను వదిలి ఇతర కర్మలను చేపడుతారు. దీంతో కలియుగం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. కాశీ నగరాన్ని కొన్ని రోజుల పాటు మూసివేస్తారు. 1910-12 మధ్యలో గంగా నదికి వరదలు వచ్చినప్పుడు కలరా వ్యాధి వ్యాపించింది. దీంతో కాశీని చాలా రోజుల వరకు దర్శించలేదు. తాజాగా 2020లో కరోనా కారణంగా ఆలయం మూతపడింది.
సృష్టికి ప్రతిసృష్టి చేయాలంటూ పలు రకాల యంత్రాలను తయారు చేస్తుంటారు. అవయవాలను అమరుస్తారు. చావుని తప్పించే యంత్రాన్ని మాత్రం కనిపెట్టలేరు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని ఎక్కువగా మరణిస్తారు. కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది. అనంతరం వేలాది మంది మరణిస్తారు. కృష్ణగోదావరి మధ్య మహాదేవుడు అన్నవాడు జన్మించి అన్ని మతాలను సమానంగా చూస్తూ గుళ్లు, గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. మహిళలు నడత తప్పుతారు. వావి వరుసలు మాయం అవుతాయి. కృష్ణమ్మ, దుర్గమ్మ ముక్కు పడుకని తాకుతుంది. రాజులు బిచ్చగాళ్లు అవుతారు. బిచ్చగాళ్లు ధనవంతులు అవుతారు. వ్యాపారం నీతిగా చేయాలనుకునే వారు కరువు అవుతారు. ధన ఆశతో జీవితాన్ని సాగిస్తారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రోజు రోజుకు పెరుగుతున్న కుక్కకాటు బాధితుల సంఖ్య.. కరిచిన వెంటనే ఇలా చేస్తే..!
ఇక అడవి జంతువులు పట్టణాలు, పల్లెల్లో తిరుగుతుంటాయి. అడవులు అరణ్యాల్లో మంటలు ఏర్పడి రోజుల తరబడి మండుతుంటాయి. కృష్ణానది మధ్యలో రథం కనబడుతుంది. రథం చూసిన వారి కళ్లు పోతుంటాయి. రెండు బంగారు హంసలు భూమి మీద తిరుగుతాయి. అత్యాశతో వాటిని పట్టుకోవాలనుకునే వారు నాశనం అవుతారు. శ్రీశైలం పర్వతం పై మొసలి సంచరిస్తుంది. ఆ మొసలి 8 రోజుల ఉండి బ్రమరాంభ గుడిలో చేరి మేకలా అరిచి మాయం అవుతుంది. తూర్పు దేశం అంతా నవ నాగరికత పేరుతో విచ్ఛలవిడితనం పెరుగుతుంది. వివాహాల్లో కుల గోత్రాల పట్టింపులను వదులుతారు. ప్రపంచంలో నదులు పొంగుతాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాయి. జల ప్రవాహాల వల్ల 14 నగరాలు మునిగిపోతాయి. ఆనంద నామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనలు కనబడుతుంటాయి. జరిగిన సమయంలో తాను మళ్లీ వీరభోగ వసంతరాయులుగా జన్మిస్తానని వీర బ్రహ్మంగారు చెప్పారు.
ఇది కూడా చదవండి : నేలపై కూర్చుని తినడం వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా..?