పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనేది టాలీవుడ్ లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఏ హీరోకు అయినా ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు కానీ పనవ్ కల్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. పవన్ ను ఒక్కమాట అన్నా అస్సలు ఊరుకోరు. పవన్ కల్యాణ్ సినిమా వచ్చిందంటే చాలా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తారు. ఇక పవన్ కల్యాన్ కెరీర్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ కు మాత్రం ఆ సినిమాలు తెగనచ్చేశాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….
Advertisement
పవన్ కల్యాణ్ జానీ సినిమా ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చింది. ఈ సినిమాకు పవన్ స్వయంగా కథ రాసుకుని తెరకెక్కించారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ యూత్ లో మాత్రం ఈ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఇవి కూడా చదవండి:రష్మీపై ఫైర్ అయిన సుధీర్ అక్క..అసలు కారణం తెలిస్తే షాకవుతారు..!!
Advertisement
పవన్ కల్యాణ్ గుండుబా శంకర్ సినిమాలో సరికొత్త స్టైల్ తో ట్రెండ్ సెట్ చేశారు. రెండు ప్యాంట్ లు వేసుకుని సరికొత్త లుక్ లో కనిపించారు. ఫ్యాన్స్ కు నచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
అన్నా చెల్లెలి అనుబంధం నేపథ్యంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా అన్నవరం. ఈ సినిమా కూడా ఫ్యాన్స్ కు ఎంతో నచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టింది.
పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా కొమురం పులి. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
పవన్ కల్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పంజా కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమా చాలా మంది అభిమానులకు నచ్చింది.
ఇవి కూడా చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..!