ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో నితిన్ కూడా ఒకరు .. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి నితిన్ కరోణా సమయంలో తక్కువమంది బంధువులు, సన్నిహితులు మద్య ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు నితిన్ శాలిని. అయితే ప్రస్తుతం నితిన్ భార్య గురించి ఒక విషయం బయటకు వచ్చింది. షాలిని కందుకూరి చిరంజీవి కుటుంబానికి సన్నిహితురాలని తెలుస్తోంది.
Advertisement
ALSO READ:
షాలిని తల్లిదండ్రులది కూడా ప్రేమ పెళ్లి కావడం విశేషం. వీరిద్దరు కర్నూల్ లో ఫేమస్ డాక్టర్స్ గా కొనసాగుతున్నారు. 20 సంవత్సరాలుగా అక్కడ ఒక నర్సింగ్ హోమ్ కూడా నిర్వహిస్తున్నారట. 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కర్నూలు నియోజకవర్గానికి శాలిని తల్లి నూర్జహాన్ ను నిలబెట్టారు చిరంజీవి. ఈమె ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఇక అప్పటి నుంచి చిరంజీవికి మరియు శాలిని తల్లిదండ్రులకు మంచి స్నేహం ఏర్పడింది.
Advertisement
ఈ క్రమంలో మెగా ఫ్యామిలీతో షాలినికీ కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇష్క్ సినిమా సమయంలో నితిన్ మరియు షాలినిల మధ్య ఒక స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి చివరికి వివాహం చేసుకునే వరకు వచ్చింది. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం సినిమా అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.
ALSO READ: