Home » దారుణం: భార్య లావై పోయిందని ఇంట్లో నుంచి గెంటేసి.. విడాకులు అడిగిన భర్త..!!

దారుణం: భార్య లావై పోయిందని ఇంట్లో నుంచి గెంటేసి.. విడాకులు అడిగిన భర్త..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అందంగా ఉందని ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పిల్లాడు పుట్టిన ఏడు సంవత్సరాల తర్వాత ఆ ప్రబుద్ధుడు కి ఏమైందో ఏమో విడాకులు కావాలని వేధించడం మొదలు పెట్టాడు. మరి దానికి కారణం ఏమిటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.. మీరట్ లోని జకీర్ కాలనీకి చెందిన నజ్మా కు 8 సంవత్సరాల క్రితం పతేపూర్ కు చెందిన సల్మాన్ తో వివాహం జరిగింది. వారికి ఏడు సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్నాడు.

Advertisement

ALSO READ;ఆ స్టార్ హీరోయిన్‌తో ప్ర‌భాస్ ఫోన్ కాల్ లీక్‌.. ఏం మాట్లాడారో తెలుసా..?

అయితే పెళ్లి తర్వాత నజ్మా బరువు పెరుగుతూ వచ్చింది. దీంతో విసుగు చెందిన భర్త రోజు వేధింపులకు గురి చేసేవాడు. నువ్వు చాలా లావై పోయావని, నీతో ఉండాలంటే చిరాకుగా ఉందని నీతో జీవించాలని అనిపించడం లేదంటూ విడాకుల పత్రాలు పంపించాడు. అయితే విడాకుల ముందువరకు భర్త అన్న మాటలను పట్టించుకోలేదు నజ్మా.. సడన్ గా విడాకుల పత్రాలు పంపించడంతో షాక్ కు గురైంది. అయితే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక ప్రతి మహిళ శరీరంలో మార్పులు అనేవి సహజం. అవి సర్వసాధారణమని చెబుతోంది నజ్మా..

Advertisement

నా భర్త విడాకులు కోరినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడాకులు ఇవ్వనని చెప్పుకొస్తోంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. నాకు విడాకులు ఇవ్వాలని లేదంటూ, నా భర్తతో నేను జీవితకాలం ఉంటానని చెప్పుకొస్తోంది. కానీ ప్రస్తుత కాలంలో ఒక్కొక్కరి బుద్ది ఒక్కో విధంగా మారుతుంది అని చెప్పడంలో ఇది ఒక ఉదాహరణ.. పెళ్లి అనే పదానికి మాయని మచ్చ తెస్తూ, నూరేళ్ల జీవితాన్ని మూన్నాళ్ళకే ముగించేస్తూన్నారు.

ALSO READ;బాలయ్య ఆ బ్లాక్ బస్టర్ సినిమా కోసం.. చిరు ఏకంగా ఒక యాడ్ లో నటించారు.. ఏంటది..!!

Visitors Are Also Reading