తెలుగు చిత్రపరిశ్రమ కీర్తిని దేశమంతా చాటిన నటుడు నందమూరి తారకరామారావు. పాలు అమ్మే స్థాయి నుండి తారకరామారావు టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. సినిమాల్లో రాణించిన అనంతరం రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అతితక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పై పీఠాన్ని అదిష్టించారు. సీఎంగా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రూపాయికి కిలో బియ్యం పథకం అన్నగారి హయాంలోనే ప్రారంభించారు.
Advertisement
దాని స్పూర్తితోనే ఇప్పటికీ ఆ పథకాన్ని పేర్లు మార్చి కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నిజజీవితం కూడా సినిమా కంటే తక్కువేమి కాదు. పెద్ద కుటుంబం ఉన్నా కూడా చివరికి ఒంటరిగా మిగిలిపోయారు. దిగ్గుతోయని స్థితిలో గుండె పోటుతో మరణించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగపెట్టిన తరవాతనే ఆయన జీవితంలో కష్టాలు మొదలయ్యాయని చెబుతుంటారు.
Advertisement
బసవతారకం గారి మరణం తరవాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మిపార్వతి వచ్చారు. ఇక రెండో పెళ్లి చేసుకున్న తరవాతనే ఎన్టీఆర్ కుటుంబానికి దూరం అవ్వాల్సి వచ్చిందని టాక్ ఉంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి కంటే ముందు బసవతారకంగారు బ్రతికి ఉన్నప్పుడే ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. హీరోయిన్ కృష్ణ కుమారిని ఎన్టీఆర్ వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
ఆమెతో ఎన్టీఆర్ దాదాపు పెళ్లి వరకూ వెళ్లారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణకుమారి సోదరి నటి షావుకారు జానకి ఎన్టీఆర్ కృష్ణకుమారిల రిలేషన్ గురించి స్పందించారు. ఎన్టీఆర్ కృష్ణకుమారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని నేను తిట్టానని వార్తలు వచ్చాయి. కానీ అది అబ్బదం అని ఆయన అంటే తనకు విపరీతమైన గౌరవం అని చెప్పారు.