Home » పాండ్యకు ఏమైంది.. నేటి మ్యాచ్ లో ఎందుకు లేడో తెలుసా..?

పాండ్యకు ఏమైంది.. నేటి మ్యాచ్ లో ఎందుకు లేడో తెలుసా..?

by Azhar
Ad

భారత జట్టు ఆసియా కప్ లో పాకిస్థాన్ పై గెలిచిన ఊపుతో హాన్ కాంగ్ పైన ఈరోజు తలపడుతుంది. అయితే హాన్ కాంగ్ జట్టును చిన్న జట్టు అనుకుంటే తప్పు అని అందరికి తెలుసు. ఎందుకంటే గతంలో ఈ రెండు జట్లు ఎదురు పడిన సమయంలో ఆ జట్టు ఇండియాకు చుక్కాలు చూపించింది. అందుకే ఈరోజు ఆ జట్టుపై పక్క ప్లాన్స్ తో రంగంలోకి దిగుతుంది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆడటం లేదు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇక ఈ టాస్ సమయంలో రోహిత్ శర్మ జట్టులో మార్పుల గురించి వివరించాడు. జట్టు నుండి పాండ్యను తప్పించి అతని స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు.

Advertisement

అయితే అలా ఎందుకు చేసారో కూడా రోహిత్ వివరించాడు. పాండ్య జెట్టులో చాలా కీలకమైన ఆటగాడు అని.. అందుకే అతడిని కీలక మ్యాచ్ ల కోసం రెస్ట్ ఇస్తున్నాము అని చెప్పాడు. అయితే పాండ్య జట్టులో ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది అని చాలా మంది ఆటగాళ్లు అన్నారు. ఆయా విషయాన్ని పాకిస్థాన్ పై మ్యాచ్ గెలిపించి పాండ్య నిరూపించాడు. అన్హుకే అతడిని సూపర్ 4 జట్టు పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే నేటి ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా సూపర్ 4 లో బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా ప్రయోగాలు చెయ్యడం మంచిది కాదు..!

టీమిండియా దుబాయ్‌లో బ‌స చేసే హోట‌ల్‌లో రోజుకు ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading