కన్నడలో 16 సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీకర్ శ్రీనివాస్ దర్శకత్వంలో 1997 మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజు రక్తాక్షరాలు షూటింగ్ ప్రారంభం అయింది. 1947లో భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన కానీ హైదరాబాద్ కు మాత్రం రాలేదు. కారణం బ్రిటిష్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిజాం ప్రభువు నిరంకుశ పాలన సాగించారు. 1947 సెప్టెంబర్ 17 వ తేదీన తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ తయారుచేసుకుని రక్తాక్షరాలు సినిమా షూటింగ్ ప్రారంభించారు.
Advertisement
ALSO READ;శుభలేఖ మూవీ ఫంక్షన్ లో కమల్ హాసన్ చిరంజీవి గురించి అలా మాట్లాడారా..?
ముందుగా ఈ చిత్రంలో కృష్ణ పోషించే పాత్ర చాలా తక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ తర్వాత ఆలోచించుకుని ఆయన పాత్ర నిడివి పెంచి పూర్తి స్థాయి కథా నాయకుడిగా మలిచారు. హీరోయిన్ రవళి చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో గొర్రెలు కాసుకునే లచ్చుమమ్మ పాత్రకి ఇంద్రజను ఎంపికచేశారు. ఆ సమయంలోనే పద్మాలయా సంస్థ నిర్మిస్తున్న ఎన్కౌంటర్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. అయినా రక్తాక్షరాలు చిత్రంలోని పాత్ర నచ్చి సినిమా ఒప్పుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. అల్లూరి సీతారామరాజు మూవీ అంతటి పేరు తెచ్చే మూవీగా ఇది నిలుస్తుందని భావించారు.
Advertisement
అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత రామబ్రహ్మం చేతులెత్తేసారు. ఆగస్టు ఒకటి నుండి మూడవ షెడ్యూల్ ను ప్రారంభించాలి. తెలంగాణ సాయుధ పోరాటం సెప్టెంబర్ 13న ప్రారంభం కావడంతో ఆ రోజే చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. ఇక షూటింగ్ ఆగితే విడుదల ఎలా చేస్తారు అని భావించిన కృష్ణ తానే చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఎన్కౌంటర్ మూవీ అప్పటికే ప్రారంభించడంతో, రక్తాక్షరాలు మూవీ పై దృష్టి పెట్టలేక పోయారు. ఒక వేళ సినిమా పూర్తై విడుదల అయి ఉంటే మాత్రం ఆయన సినీ జీవితంలో మరో గొప్పగా పాత్ర పోషించిన హీరోగా నిలిచేవారు.
ALSO READ;