ఒకప్పుడు ఏం తినాలన్నా అప్పుడే పండినవి తాజాగా ఉన్న కూరగాయలను వండుకుని తినేవారు. పురుషులు వ్యవసాయం చేస్తే మహిళలు ఇంటిపనులు వంట పనులు చేసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. దాంతో తాజాగా వండుకోలేని పరిస్థితి అంతే కాకుండా సంత నుండి తీసుకువచ్చిన కూరగాయలను ఫ్రిజ్ లో పెట్టి ఆ తరవాత వంట చేస్తారు.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలోని అమ్మాయి ఒకప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా..?
Advertisement
ఇక వండినవి కూడా పాడవకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి వారం రోజుల పాటూ తింటున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన కొన్ని ఆహారపదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. అంతే కాదు ఆ ఆహారపదార్థాలు విషంతో సమానమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం….ఫ్రిడ్జ్ లో ఎక్కువ మంది పాలను పెడుతూ ఉంటారు. అయితే పాలను ఫ్రిడ్జ్ లో పెట్టి తాగటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట.
ఇవి కూడా చదవండి: అరటి పండ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!
Advertisement
పెరుగును కూడా ఫ్రిడ్జ్ లో పెడితే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాలు పెరుగులో లాక్టోస్ బాసిల్లస్ అనే బాక్టీరియా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అది చెడు బ్యాక్టిరియాగా మారే అవకాశం ఉందట. దాంతో అది తింటే ఎసిడిటి సమస్యలు వస్తాయట. గుడ్లను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం అరోగ్యానికి మంచిది కాదట.
ఇవి కూడా చదవండి: ప్రతి రోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెడితే తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ కూరగాలయల్లో ఉండే పోషకాలు కూడా నశించి పోతాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు కాకుండా వండిన ఆహారాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదట. ఫ్రిడ్జ్ లో పెట్టిన తరవాత ఆ వంటకాలను తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.