Home » నాగార్జున ని మొదటి సారి చూడగానే ఇష్టపడ్డాను..! నాగ్ నా దగ్గరికి వచ్చి ఏంచేశారంటే ?

నాగార్జున ని మొదటి సారి చూడగానే ఇష్టపడ్డాను..! నాగ్ నా దగ్గరికి వచ్చి ఏంచేశారంటే ?

by AJAY
Ad

ఒకప్పటి హీరోయిన్ లు చాలా మంది ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మరియు సీరియల్స్ లో నటిస్తున్నారు. అలా ఒకప్పటి హీరోయిన్ కస్తూరి సైతం ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. కస్తూరి తమిళ్ ఇండస్ట్రీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆక్కట్టుంది. మెల్లి మెల్లిగా హీరోయిన్ గా కూడా అవకాశాలను అందుకుంది.

Also Read:  CHANDRAMUKHI REAL STORY: చంద్రముఖి రాజుని చంపిందెవరు.. అసలు కథేంటంటే..?

Advertisement

Also Read:   మొల‌కెత్తిన శ‌న‌గ‌లు, బెల్లం క‌లిపి తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ మ‌టుమాయం

అంతే కాకుండా అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కమల్ హాసన్ కు సైతం జోడిగా నటించిన అలరించింది. ఇక టాలీవుడ్ లో నాగార్జున తో రెండు సినిమాల్లో నటించి అలరించింది. నాగార్జున హీరోగా నటించిన భక్తిరస చిత్రం అన్నమయ్యలో కస్తూరి కూడా నటించింది. అంతే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో ఆకాశ వీధిలో అనే మరో సినిమా కూడా వచ్చింది. సినిమాల్లో ఆఫర్ లు తక్కుముకం పట్టడం తో కస్తూరి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.

Advertisement

ఇక ఇటీవలే రీఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు, సీరియల్స్ చేస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూ లో కస్తూరి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాగార్జున ను మొదటి సారి చూసిన రోజే తాను పడిపోయానని చెప్పింది. అంతే కాకుండా తాను నాగార్జున కు పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. షూటింగ్ సమయం లో నాగార్జున తనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని ఆ రోజు మొత్తం చేతిని కడుక్కొలేదని తెలిపింది.

ఆ చేతిని ఎవరిని తాకనివ్వలేదని పేర్కొంది. ఓ సినిమా లో నితిన్ హీరోయిన్ చేయి తాకడం తో రాత్రి మొత్తం అలాగే చూస్తూ ఉండిపోతాడు అని తాను కూడా అలాగే ఉండిపోయాను అని వెల్లడించింది. ఇక నాగ్ పై మనసుపారేసుకున్న హీరోయిన్ లు చాలా మంది ఉన్నారన్న సంగతి తెలిసిందే. టబు అయితే నాగ్ కోసమే పెళ్లికి దూరంగా ఉంది అనే టాక్ కూడా ఉంది.

Also Read: MACHERLA NIYOJAKAVARGAM MOVIE REVIEW : నితిన్ “మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం” సినిమా రివ్యూ..!

Visitors Are Also Reading