Home » విగ్నేష్ చేసిన ఆ చిలిపి పనికి..వాంతింగ్స్ తో హాస్పిటల్లో చేరిన నయనతార..!!

విగ్నేష్ చేసిన ఆ చిలిపి పనికి..వాంతింగ్స్ తో హాస్పిటల్లో చేరిన నయనతార..!!

by Sravanthi
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు నయనతార.. ఆమె సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా అనేక లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. తన అందం అభినయంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నయన్ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానం లో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ్,మలయాళం, కన్నడ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. తిరుగులేని హీరోయిన్ గా రెండు చేతులా సంపాదిస్తూ ముందుకు పోతోంది.

Advertisement

అలాగే నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తీసుకోనంత పారితోషికం నాలుగు కోట్ల రూపాయలు తీసుకొని చరిత్ర సృష్టించింది. దీనికి కారణం ఆమె చేసిన చాలా సినిమాలు హిట్ అవ్వడమే. అలాగే సీనియర్ హీరోలతో పోటీపడి మరీ నటిస్తోంది. దీంతో నిర్మాతలు కూడా ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటున్నారు. అదే ప్రస్తుతం ఆమె 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల నుండి వస్తున్న టాక్. ఆమె చిన్న సినిమాల్లో నటించడం లేదని, భారీ ప్రాజెక్టులు మాత్రమే సైన్ చేస్తోందని తెలుస్తోంది. ఇటీవలే నయన్ తను ప్రేమించిన తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. చెన్నైలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

అంతేకాకుండా నయనతార తన భర్తకు 20 కోట్లు విలువ చేసే ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. ఇంతలోనే నయనతార హాస్పటల్లో చేరిందట.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏం జరిగిందంటే.. తన భర్త విగ్నేష్ ఒక స్పెషల్ రెసిపీ ని తయారు చేశారట. అది కాస్త బెడిసి కొట్టడంతో, నయనతారకు వామిథింగ్స్ అయ్యయట. అంతేకాక స్కిన్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. దీంతో డాక్టర్లు కొంత సమయం వరకు ఆమెను అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading