Home » ఫ్లాప్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ ‘బింబిసారా ‘ మూవీ ని వదిలేసుకున్న స్టార్ హీరో అతడేనా !

ఫ్లాప్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ ‘బింబిసారా ‘ మూవీ ని వదిలేసుకున్న స్టార్ హీరో అతడేనా !

by AJAY
Published: Last Updated on
Ad

రాళ్లు పోగుచేసుకుని వ‌జ్రాల‌ను మిస్ చేసుకున్న‌ట్టు కొన్నిసార్లు హీరోలు సూప‌ర్ హిట్ సినిమాలను మిస్ చేసుకుని ఫ్లాప్ సినిమాల‌ను ఎంచుకుంటారు. ముందుగా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన సూప‌ర్ హిట్ అయ్యే క‌థ‌ను రిజెక్ట్ చేసి ఫ్లాప్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తారు. ఆ త‌ర‌వాత మిస్ చేసుకున్న సినిమా రిజ‌ల్ట్ చేసి షాక్ అవుతారు. ఎలాంటి క‌థ‌ను ఎంచుకుంటున్నాం అనేదానిపై కూడా ముందే అవ‌గాహ‌న ఉండాలి లేదంటే ఆ త‌ర‌వాత బాధ‌ప‌డ‌క త‌ప్ప‌దు.

Advertisement

ఇక తాజాగా క‌ల్యాణ్ రామ్ సూప‌ర్ హిట్ అందుకున్న బింబిసార సినిమాను కూడా ముందుగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశార‌ట‌. ఆగ‌స్టు 5న ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన బింబిసార సినిమా సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బింబిసారుడి క‌థ ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించారు. ఈ సినిమాలో కేథ‌రిన్ థెరిస హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఈ చిత్రానికి నూత‌న దర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా పోస్ట్ మ‌రియు ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. సినిమా పోస్టర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి బాహుబ‌లి, మ‌గ‌ధీర మాదిరిగా పోస్ట‌ర్ లు ఉన్నాయ‌ని ఆ రేంజ్ లో సినిమా ఉంటుందో అని ట్రోల్స్ కూడా వ‌చ్చాయి. కానీ సినిమా పై క‌ల్యాణ్ రామ్ మాత్రం ముందు నుండి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఇక సినిమా విడుద‌ల‌య్యాక ట్రోల‌ర్స్ నోరు మూయించాడు.

 

ఇదిలా ఉండ‌గా ఈ సినిమాను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు. ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ ఈ సినిమా క‌థ‌ను ముందుగా ర‌వితేజ కు చెప్పార‌ట‌. కానీ ర‌వితేజ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక ర‌వితేజ రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో ర‌వితేజ ఫ్లాప్ సినిమా కోసం సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్నాడ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ : శోభన్ బాబు “సర్పయాగం” సినిమాకు ఒంగోలు టిప్ టాప్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి తెలుసా..?

Visitors Are Also Reading