బుల్లితెరపై గల్లీ బాయ్స్ గా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి భాస్కర్, సర్దాం,రియాజ్,యాదమ్మ రాజు ఇంకా మరికొంత మంది నటులు ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా షోలలో దూసుకుపోతున్నారు. ఇందులో ముఖ్యంగా సర్దాం టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ షోలో ఆది ఎలాగో, అదిరింది షో కు సర్దాం అలా.. అలాగే జబర్దస్త్ లో పొట్టి నరేష్ ఎలాగో, అదిరింది లో రియాజ్ అలా మారిపోయారు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలానికే ఒక మంచి కమెడియన్ గా ఫేమస్ అయిపోయారు రియాజ్.
Advertisement
ఇక ఆయన కమెడియన్ గా మాత్రమే కాకుండా జనసేన పార్టీలో తిరగడం ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మరింత ఫేమస్ అయ్యారు. కానీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదంతా పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రియాజ్ పెళ్లి విషయం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఆయన పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.. మరి పెళ్లి ఎప్పుడు జరిగింది?ఎవరితో జరిగింది?అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. కానీ వివాహ మాత్రం జరిగిందని కొన్ని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు మరియు బరాత్ కు సంబంధించిన కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
ఈ తరుణంలోనే అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ రియాజ్ తన భార్య ని ఏకంగా స్టేజ్ పైకి తీసుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంగుచాటు మొగుడిగా రియాజ్ తన భార్య వెనకాల దాక్కొని చిన్నగా నవ్వుతూ బయటకు రావడం చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ షోలో సర్దాం కామెడీ బాగా చేస్తారా లేదంటే రియాజ్ బాగా చేస్తారా అని అడగ్గా.. తన భర్తే బాగా చేస్తారు అని చెప్పింది యాస్మిన్.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ని మీరు కూడా ఓ లుక్కేయండి..
ALSO READ;