Home » పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు.. నాకు అంత మైండ్ లేదంటూ..!!

పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు.. నాకు అంత మైండ్ లేదంటూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమారంగంలో సక్సెస్ సాధించిన చాలా మంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇందులో వారు సక్సెస్ అవుతారో కాదో చెప్పలేం కానీ, సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఈ కోవకు చెందిన టాలీవుడ్ నటుల లో ఒకరైన స్టార్ నటుడు జగపతి బాబు పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే సినిమా అనేది ఒక మాయ అయితే రాజకీయం అనేది మాయాలోకమని అర్థం చేసుకోవచ్చు.

Advertisement

పాలిటిక్స్ అనే మాయలో పడి అర్థం చేసుకోవడం నాతో కాదని ఆయన చెప్పుకొచ్చారు. నాకు అంత మైండ్ లేదని, ఒకవేళ ఉన్నా అంత ఓపిక కూడా లేదని జగపతి బాబు అన్నారు. అందుకే పాలిటిక్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. నాకు నలుగురితో మాట్లాడి మెప్పించే తెలివి లేదని, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వారితో దూసుకెళ్లడం అంత సులువైన పని కాదు అని అన్నారు.

Advertisement

నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, పార్టీ పెట్టడం అనేది జరగని పని.భవిష్యత్తులో కూడా ఆ నిర్ణయం తీసుకునే ఉద్దేశం కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు జగతిబాబు. పరంపర సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జగతిబాబు ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈయన తెలుగు ఇండస్ట్రీలో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading