Home » అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చిన ‘ఆర్య’ సినిమా వెనుకున్న ఇంత కథ ఉందా ? ఎన్ని స్టోరీలు రిజెక్ట్ అయ్యాయంటే ?

అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చిన ‘ఆర్య’ సినిమా వెనుకున్న ఇంత కథ ఉందా ? ఎన్ని స్టోరీలు రిజెక్ట్ అయ్యాయంటే ?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్కో హీరో కెరీర్ ను ఒక్కో సినిమా నిల‌బెడుతుంది. అలా ప్ర‌తిహీరోను నిల‌బెట్టిన సినిమా వెన‌క ఎంతో చ‌రిత్ర కూడా ఉంటుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హీరోగా నిల‌బెట్టిన చిత్రం ఆర్య సినిమా. ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ చిత్రానికి ముందు ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. సుకుమార్ ఆర్య సినిమా కంటే ముందు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పనిచేశాడు. అంతే కాకుండా దానికంటే ముందు సుకుమార్ మ్యాథ్స్ టీచర్ గా కూడా ప‌నిచేశాడు.

Advertisement

ఇదిలా ఉంటే సినిమాల‌పై ఆస‌క్తి ఉన్న సుకుమార్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర‌వాత ఆర్య క‌థ‌ను రాసుకున్నాడు. ఈ కథ‌కు వైజాగ్ లోని ఆర్కే బీచ్ వ‌ద్ద మెరుగులు దిద్దార‌ట‌. ఇక సుకుమార్ దిల్ రాజు నిర్మించిన దిల్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు. ఈ సినిమా స‌మయంలో దిల్ రాజు సుకుమార్ లోని క‌సిని ప‌సిగ‌ట్టార‌ట‌. అంతే కాకుండా దిల్ సినిమా హిట్ అయితే నీకు ఆఫ‌ర్ ఇస్తా..క‌థ రెడీ చేసుకో అంటూ బంప‌రాఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. దిల్ సూప‌ర్ హిట్ అయ్యింది.

Advertisement

దాంతో స‌కుమార్ ను ఆఫీస్ కు పిలిపించుకుని క‌థ న‌చ్చింది. మ‌నం సినిమా చేద్దామ‌ని హామీ ఇచ్చాడ‌ట‌. దాంతో హీరో కోసం వెతికే ప‌నిలో మొద‌ట‌గా ర‌వితేజ‌, నితిన్, ప్ర‌భాస్ ల‌కు క‌థ‌ను వినిపించాడ‌ట‌. కానీ ఆ ముగ్గురు కూడా ఈ సినిమా క‌థ‌ను రిజెక్ట్ చేశారు. ఆ త‌ర‌వాత కొత్త‌వాళ్ల‌తో చేస్తే బాగుంటుందేమోన‌ని అనుకున్నాడ‌ట‌. ఇక అప్పుడే గంగోత్రితో అల్లు అర్జ‌న్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ త‌న క‌థ‌లో బ‌న్నీనే హీరో అనుకుని దిల్ రాజుకు చెప్పాడ‌ట‌.

ఇక దిల్ రాజు వెంట‌నే బ‌న్నీని ఆఫీస్ కు పిలిచి సుకుమార్ చేత క‌థ వినిపించాడ‌ట‌. దాంతో అల్లు అర్జున్ గంగోత్రి త‌ర‌వాత 96క‌థ‌లు విన్నాను అన్నీ రోటీన్ క‌థ‌లు అంటూ నీరసంతో చెప్పాడ‌ట‌. దాంతో దిల్ రాజు మాది డిఫ‌రెంట్ క‌థ నీకు క‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని చెప్ప‌డంతో స‌రేన‌ని క‌థ విన్నాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో అల్లు అర‌వింద్ కు కూడా క‌థ‌ను వినిపించారు. ఆ త‌ర‌వాత కొన్ని మార్పులు చేర్పుల‌తో ఆర్య సినిమాను ప‌ట్టాలెక్కించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ క్రేజీ ద‌ర్శ‌కుడిగా మార‌గా బ‌న్నీ స్టార్ గా మారిపోయాడు.

Visitors Are Also Reading