Home » ప‌సి పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లిదండ్రులు ఒకే మంచంపై నిద్రించ‌వ‌చ్చా..? వైద్యులు ఏమంటున్నారంటే..?

ప‌సి పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లిదండ్రులు ఒకే మంచంపై నిద్రించ‌వ‌చ్చా..? వైద్యులు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

అమెరికా న‌టి అలిసియా సిల్వ‌ర్ స్టోన్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె త‌ల్లిదండ్రుల విష‌యంలో త‌న విభిన్న శైలి కార‌ణంగా ఎప్పుడూ చ‌ర్చ‌ల్లో నిలుస్తుంటుంది. అలీసియా ఇటీవ‌ల త‌న 11 ఏళ్ల కొడుకుతో క‌లిసి నిద్రిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది అలీసియా. ఇది చూసిన నెటిజ‌న్లు ఆమెపై ఫైర‌వుతున్నారు. ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. అత‌ను స్వ‌తంత్రంగా ఉండ‌డం ఎలా నేర్చుకుంటాడు..? మీరు మీ కుమారునికి సాయం చేయ‌డం లేదు. పైగా హాని చేస్తున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్ చేయ‌డంతో ఇప్పుడు అవి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Advertisement

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి ఒకే మంచంపై నిద్రించ‌వ‌ద్దా..? అనే సందేహాలు క‌లుగుతున్నాయి. నిజానికి ప్ర‌తీ త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డను అన్ని విధాలుగా సంర‌క్షించుకుంటారు. క‌నీ అలీసియా కొడుకుతో క‌లిసి నిద్రించ‌డాన్ని నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లిదండ్రులు ఏ వ‌య‌స్సు వ‌ర‌కు ప‌డుకోవాలనే అంశంపై శిశు వైద్యులు, మ‌న‌స్త‌త్వవేత్త‌లు ఏం చెబుతున్నారో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement


పిల్ల‌ల‌తో క‌లిసి ఒకే మంచంపై నిద్రించ‌డం అనేది వారి వ్య‌క్తి గ‌త విష‌యమ‌ని న్యూయార్క్ చెందిన శిశు వైద్యుడు రెబెక్కా ఫిస్క్ తెలిపారు. ముఖ్యంగా 12 నెల‌ల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌తో క‌లిసి మాత్రం ఎప్పుడూ నిద్రించ‌కూడ‌దు. ఇది ఆక‌స్మిక శిశు మ‌ర‌ణ సిండ్రోమ్ ప్ర‌మాదాన్ని పెంచుతుంది. ఒక‌వేళ మీరు మీ బిడ్డ‌తో ప‌డుకుంటే రోజు అంతా సౌక‌ర్య‌వంతంగా ఉండేవిదంగా చూసుకోవాలి. ఇక అదే స‌మ‌యంలో మ‌న‌స్త‌త్వ‌వేత్త ఎలిజ‌బేత్ మాథిస్ మాత్రం ఒకే బెడ్ పై పడుకోవ‌డం చాలా మంచిది అని కొన్ని సంద‌ర్భాల్లో రుజువు అయింది. డాక్ట‌ర్ ఫిస్క్ అభిప్రాయాన్ని కూడా స‌మ‌ర్థించారు మాథిస్‌.


ముఖ్యంగా యుక్త వ‌య‌స్సులో త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు వేర్వేరుగా నిద్రించాలి. యుక్త వ‌య‌స్సు ప్రారంభం అయ్యే స‌గ‌టు వ‌య‌స్సు బాలిక‌ల‌కు 11 సంవ‌త్స‌రాలు అబ్బాయిల‌కు 12 సంవ‌త్స‌రాలు. 8 నుంచి 13 సంవ‌త్స‌రాల మ‌ధ్య బాలిక‌ల‌కు యుక్త‌వ‌య‌స్సు రావ‌డం సాధార‌ణ‌మే. అబ్బాయిల్లో యుక్త‌వ‌య‌స్సు రావ‌డం కూడా స‌హ‌జ‌మే. అబ్బాయిల్లో యుక్త వ‌య‌స్సు 9 సంవ‌త్స‌రాల నుంచి 14 సంవ‌త్స‌రాల మ‌ధ్య ప్రారంభం అవుతుంది. దీనిపై డాక్ట‌ర్ మాథిస్ స్పందిస్తూ.. పిల్ల‌ల శ‌రీరాలు యుక్త వ‌య‌సులో మార్పులకు గుర‌వుతాయి. వారికి కాస్త ప్రైవ‌సీని ఇవ్వాలి. మీ పిల్ల‌లు ఒకే బెడ్ పై ప‌డుకుంటే మీ ప్రైవ‌సీని ప్ర‌భావితం చేస్తుంది.

Also Read : 

కేవ‌లం 10 నిమిషాల్లోనే బొద్దింక‌ల‌ను త‌రిమికొట్టె చిట్కాలు ఇవే..!

Anchor Syamala : యాంక‌ర్ శ్యామ‌ల హోంటూర్ వీడియో చూశారా మీరు..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Visitors Are Also Reading