Home » Anchor Syamala : యాంక‌ర్ శ్యామ‌ల హోంటూర్ వీడియో చూశారా మీరు..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Anchor Syamala : యాంక‌ర్ శ్యామ‌ల హోంటూర్ వీడియో చూశారా మీరు..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

by Anji
Ad

టాలీవుడ్ యాంక‌ర్ల‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ శ్యామ‌ల ఒక‌రు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆమె బుల్లితెర షోలు చేయ‌డంతో పాటు ప‌లు ఈవెంట్ల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో శ్యామ‌ల త‌న పాపులారిటీని మ‌రింత పెంచుకున్నారు. ప‌లు ఇంట‌ర్వ్యూల్లో, ఆడియో ఫంక్షన్ ల‌కు శ్యామ‌ల యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా శ్యామ‌ల హోం టూర్ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌గా.. ఆ వీడియోకు ఊహించ‌ని స్థాయిలో రెస్పాన్స్ రావ‌డంతో పాటు క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారింది.

ప్ర‌స్తుతం శ్యామ‌ల చేసిన హోంటూర్ వీడియోలో నేను, మా ఆయ‌న విలేజ్ అట్మాస్పియ‌ర్ నుంచి వ‌చ్చామ‌ని.. విలేజ్ ఆలోచ‌న‌లు ఇంకా పోలేద‌ని చెప్పుకొచ్చారు. అరుగు మాదిరిగా ఉండేవిధంగా మెట్ల‌ను నిర్మించుకున్నామ‌ని తెలిపారు. ఇక ఈ ప్లేస్‌ మాకు మోస్ట్ చిల్లింగ్ ప్లేస్ అని చెప్పుకొచ్చారు శ్యామ‌ల‌. రోజులో ఎక్కువ‌గా స‌మ‌యం మాకు ఇక్క‌డే గ‌డిచిపోతుంద‌ని కామెంట్స్ చేశారు. మా అరుగు నాకు ఎంతో ఇష్ట‌మైన ప్ర‌దేశం అని వెల్ల‌డించారు. తాను దేవుడిని ఎక్కువ‌గా న‌మ్ముతాన‌ని  పూజ‌గ‌దిని చూపించారు శ్యామ‌ల‌. ఇక ఆ త‌రువాత వంట చేయ‌డం అంటే ఇష్టమ‌ని కిచెన్ ను చూపించారు.

Advertisement

Advertisement


కిచెన్‌లో పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. శ్యామ‌ల బెడ్ రూంలో నాలుగు బెడ్ రూమ్స్, రెండు హాల్స్ ఉన్నాయి. కొడుకు ఇషాన్ కి స్పెష‌ల్ బెడ్‌రూం ఉండ‌గా.. ఆ బెడ్ రూమ్ స్పైడ‌ర్ మ్యాన్ థీమ్ క‌నిపిస్తుంది. స్పైడ‌ర్ మ్యాన్ థీమ్ ఉన్న ఈ బెడ్ రూమ్ కి అటాచ్‌డ్ బాల్క‌నీ ఉండ‌డం గ‌మ‌నార్హం. నాకు మేక‌ప్ వేసుకోవ‌డం న‌చ్చ‌దు అని.. అందుకే నా ద‌గ్గ‌ర ఒక్క మేక‌ప్ కిట్ కూడా ఉండ‌ద‌ని వెల్ల‌డించారు శ్యామ‌ల‌. మేక‌ప్ మేన్ వ‌ద్ద‌నే నా మేక‌ప్ సామాగ్రి ఉంటుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక శ్యామ‌ల ఇంటికి ఉన్న లిప్ట్‌, ఇంటిపైన సోలార్ ఫ్యాన‌ల్ వంటి వాటి గురించి వీడియోలో చూపించారు. వైట్, గ్రే క‌ల‌ర్ లో ఇంటిని నిర్మించుకున్నామ‌ని శ్యామ‌ల తెలిపారు. ఈ వీడియో నాలుగున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. అదేవిధంగా సినిమాలు, టీవీ షోల ద్వారా భారీగానే సంపాదించార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : 

దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 10 దారుణమైన ఫ్లాప్ సినిమాలు ఇవే..!

Also Read : 

గుండమ్మ కథ కాకుండా బాలయ్య నాగ్ కాంబోలో మిస్ అయిన మరో మల్టీ స్టారర్…! ఆ గొడవలే కారణమా…?

Visitors Are Also Reading