అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా తాజాగా వచ్చిన సినిమా థాంక్యూ. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్యకు జంటగా రాశి ఖన్నా నటించింది. అయితే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య వరుస హిట్ సినిమాలు చేసాడు. అందుకే ఈ సినిమాపైన కూడా బాగానే అంచనాలు అనేవి ఉన్నాయి. పైగా నిర్మాత దిల్ రాజు కావడంతో సినిమా హిట్ అని అందరూ అనుకున్నారు. అలాగే ఈ సినిమాకు మనం సినిమా దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. అందువల్ల ఈ సినిమాపై ఆసక్తి అనేది జనాలకు బాగా పెరిగింది.
అయితే తాజాగా ఈ థాంక్యూ సినిమా విడుదల అయ్యింది. కానీ బయటకు వచ్చిన మొదటి రోజు మార్నింగ్ షో నుండే థాంక్యూ సినిమా అనేది నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఉహించినంతగా ఈ సినిమాలో ఏం లేదు అని అభిమానులు చెప్పారు. అందుకే వరుస హిట్స్ తో ఉన్న చైతన్యను ఈ థాంక్యూ సినిమాతో ప్లాప్ అనేది పలకరించింది. అయితే ఇది నిర్మాత దిల్ రాజ్ కు కూడా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య దిల్ రాజు నిర్మించిహ్న చాలా సినిమా విఫలం అవుతున్నాయి. అందుకే ఈ థాంక్యూ ప్లాప్ దిల్ రాజుకు గట్టిగానే షాక్ ఇచ్చింది.
ఇక ఈ సినిమా మొదటిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీలోకి తొందరగా తీసుకురావాలని చూసాడు దిల్ రాజు. ఇలా విడుదల తర్వాత ఎర్లీ రిలీజ్ అనేది చేస్తే ఆ ఓటీటీ సంస్థ ఎక్కువగా ఇస్తుంది. అలా అయిన నష్టాల నుండి బయట పడుదాం అని దిల్ రాజు ఎర్లీ రిలీజ్ కోసం అమెజాన్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. కానీ అమెజాన్ కూడా దిల్ రాజుకు షాక్ ఇచ్చింది. ఇలాంటి ప్లాప్ సినిమాను ఎర్లీగా విడుదల చేసిన కూడా.. ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించారు. అలాగే వ్యూస్ కూడా రావు అనే కారణంతో ఈ సినిమా ఎర్లీ రిలీజ్ కు ఎక్కువ డబ్బులు అనేవి ఇవ్వను అని దిల్ రాజుకు చెప్పినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :