టాలీవుడ్‌లో షూటింగ్ లు బంద్ కానున్నాయంటూ కొద్ది రోజులుగా ఊరిస్తున్న ఊహగానాలు వాస్తవమయ్యాయి. ఇక ఆగస్టు 01నుంచి సినిమా షూటింగ్స్ కి బ్రేకు పడనుంది. దీంతో స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదా పడే అవకాశముంది. ఇక నుంచి థియేటర్ లో విడుదలైన పెద్ద హీరోల సినిమాలను 10 వారాల తరువాతనే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. ఈ తరుణంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.
భారీ బడ్జెట్ చిత్రాలను 10 వారాల తరువాత ఓటీటీకి ఇవ్వాలి. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తరువాత ఓటీటీకి ఇవ్వవచ్చు. రూ.కోట్ల లోపు బడ్జెట్ సినిమాలపై ఫెడరేషన్‌తో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలి. సినిమా టికెట్ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణ థియేటర్లు, సీ క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70, మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేవిధంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదించింది. ఖచ్చితమైన సమయంపాలన అమలు చేయడం ద్వారా అదనపు రోజులు కాకుండా అనుకున్న సమయానికే షూటింగ్‌లు పూర్తవుతాయి. తమ సహాయకులకు వసతి,ఇతర సౌకర్యాలు కావాలని నటులు ఎవ్వరూ డిమాండ్ చేయడానికి వీలులేదు. వారి పారితోషికం నుంచే సహాయకులకు చెల్లింపులు చేసుకోవాలి.
Advertisement
Advertisement
రోజు రోజుకి నిర్మాణ వ్యయం పెరుగుతుండడంతో ప్రతి నిర్మాత ఛాంబర్, కౌన్సిల్ నియమ, నిబంధనలను పాటించాలి. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలితో చర్చించిన తరువాతనే నిర్మాన వ్యయాలు పెంచుకోవాలి. సినీ పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. వీటిపై చర్చించేందుకు నిర్మాతలు అందరూ ముందుకు రావడం లేదు. అడిగితే షూటింగ్స్ ఉన్నాయి కుదరడం లేదు అని అంటున్నారు. అందుకోసమే ఆగస్టు 01 నుంచి షూటింగ్స్ ఆపేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రధాన సమస్యల్లో ఓటీటీ ఒకటి. సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. సినిమాకి ఒక ధర పెట్టడం వల్ల థియేటర్ కి వచ్చే వాళ్లు తికమక పడుతున్నారు. వీపీఎఫ్ ఛార్జీలు నెలకు రూ.50 కోట్లు దాటుతున్నాయి. దీనిపై నిర్మాతలందరూ చర్చించాలి. అందుకే కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్ నిలిపివేసి చర్చలు జరిపితే బాగుంటుందని చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read :
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉదయభాను.. పారితోషికం ఎంతో తెలిస్తే షాకే..!!
సుమ క్యాష్ షో గురించి బయటపడ్డ అసలు నిజాలు.. ఏంటో తెలిస్తే షాకవుతారు..!!