భార్య భర్తల మధ్య అనుబంధం బాగుండాలంటే ముందుగా ఇద్దరి మధ్య ఒకరిపై మరొకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ప్రేమ నమ్మకం లేని చోట గొడవలు మొదలవుతాయి. అంతే కాకుండా ప్రేమ, నమ్మకం ఉన్నా కూడా కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్ల వల్ల ఇద్దరి మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉందట. ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పుకోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని కొన్ని విషయాలను చెప్పుకోకపోవడమే మంచిదని చాణక్యుడు తన చాణక్యనీతిలో చెప్పాడు.
Also Read: NTR అడవిరాముడు షూటింగ్ విశేషాలు. షూటింగ్ లో జరిగిన ప్రమాదం నుండి బయటపడిన హీరోయిన్స్!
Advertisement
అవేంటో ఇప్పుడు చూద్దాం….భర్త తన సంపాదన ఎంత ఉంటుందో భార్యకు కచ్చితంగా చెప్పకూడదట. అలా చెప్పడం వల్ల ఏవైనా ఖర్చులు పెట్టుకున్నా డబ్బు అంతా ఏం చేస్తున్నావంటూ పదే పదే నిలదీసే అవకాశం ఉందట. అంతే కాకుండా ఎక్కువ సంపాదిస్తున్నాడని తెలిస్తే అనవసర ఖర్చులు కూడా చేసే అవకాశం ఉందట. కాబట్టి పూర్తి సంపాదనను భర్తకు చెప్పకూడదట. అయితే ఇది అందరికీ వర్తించదు….కొన్ని కుటుంబాలలో ఇలా వ్యవహరించాల్సి ఉంటుంది.
Advertisement
అంతే కాకుండా ఇద్దరిలో వారికి ఉండే బలహీనతలను కూడా చెప్పుకోకూడదట. బలహీనతలు ఉంటే వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలని అన్నారు. కానీ బలహీనత ల గురించి చెప్పుకుంటే ఒకరిని ఒకరు దెప్పిపొడుచుకునే అవకాశాలు ఉన్నాయని దాంతో గొడవలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
Also Read: చిరును ఇరకాటంలో పెడుతున్న అమీర్ ఫ్యాన్స్..!
ఏ విషయం చెప్పకపోవడం వల్ల తమ కాపురానికి ఎలాంటి నష్టం జరగదో అలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమకు జీవితంలో ఎదురైన అవమానాలను కూడా జీవిత భాగస్వామితో షేర్ చేసుకోవద్దని చాణక్యుడు పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల సంధర్బాన్ని బట్టి జీవిత భాగస్వామి కూడా నిందించే అవకాశం ఉందని చాణక్యనీతిలో తెలిపాడు.
Also Read: తలనొప్పి మిమ్మల్ని తరచూ వేదిస్తుందా..? అయితే ఈ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు