Home » త‌ల‌నొప్పి మిమ్మ‌ల్ని త‌ర‌చూ వేదిస్తుందా..? అయితే ఈ చిట్కాల‌తో ఉప‌శ‌మ‌నం పొందవ‌చ్చు

త‌ల‌నొప్పి మిమ్మ‌ల్ని త‌ర‌చూ వేదిస్తుందా..? అయితే ఈ చిట్కాల‌తో ఉప‌శ‌మ‌నం పొందవ‌చ్చు

by Anji

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిల్లో ప్ర‌తీ ఒక్క‌రికీ త‌ల‌నొప్పి స‌మ‌స్య ఎదురవుతుంది. దీని నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి మార్కెట్‌లో ల‌భించే అనేక ర‌కాల మందుల‌ను వాడుతుంటారు. దీర్ఘ‌కాలంలో వీటి వ‌ల్ల ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ త‌లెత్తుతాయి. ఇలాంటి ప‌రిస్తితుల్లో కొన్ని హోం రెమెడీస్ ప్ర‌య‌త్నించండి.

ఆక్యుప్రెస‌ర్ :


త‌లనొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ఆక్యుప్రెష‌ర్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని కోసం మీ యొక్క అర‌చేతిని ముందు వైపున‌కు తీసుకురండి. ఇప్పుడు మ‌రొక చేతితో బొట‌న‌వేలు, చూపుడు వేలు మ‌ధ్య ఖాళీని సున్నితంగా మ‌సాజ్ చేయండి. రెండు చేతుల‌ను 4 నుంచి 5 నిమిషాల వ‌ర‌కు మసాజ్ చేయండి. ఇక త‌ల‌నొప్పి నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ఇది మంచి మార్గం.

నిమ్మ‌ర‌సం :

కొన్ని సార్లు గ్యాస్ కూడా త‌ల‌నొప్పికి కార‌ణం అవుతుంది. ఈ సంద‌ర్భంలో ఒక గ్లాస్ నీటిని వేడి చేసి దానికి నిమ్మ‌ర‌సం క‌ల‌పండి. బాగా మిక్స్ చేసి తాగితే త‌ల‌నొప్పి దూరం అవుతుంది. ఇది అన్నింటికంటే చాలా సుల‌భ‌మైన హోం రెమెడీ.

యాపిల్ :

యాపిల్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదేవిధంగా రుచిక‌ర‌మైన పండు కూడా. త‌ల‌నొప్పి చికిత్స‌లో ఇది సాయ ప‌డుతుంది. దీని కోసం యాపిల్ ను ముక్కలు ముక్క‌లుగా చేసి ఉప్పుతో క‌లిపి తినండి. దీని ప‌లితంగా త‌ల‌నొప్పి మాయం అవుతుంది.

ల‌వంగం నూనె :

త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ల‌వంగం నూనెను ఉప‌యోగించ‌వ‌చ్చు. ల‌వంగం నూనెతో త‌ల‌కు కాసేపు మ‌ర్థ‌న చేసుకోవ‌చ్చు. త‌ల‌నొప్పిని త‌గ్గించే గుణాలు ఇందులో పుష్క‌లంగా ఉన్నాయి.

Also Read : 

చిరును ఇరకాటంలో పెడుతున్న అమీర్ ఫ్యాన్స్..!

నాగార్జున‌కి జాతీయ అవార్డు మిస్ కావ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా..?

 

Visitors Are Also Reading