Home » చిరును ఇరకాటంలో పెడుతున్న అమీర్ ఫ్యాన్స్..!

చిరును ఇరకాటంలో పెడుతున్న అమీర్ ఫ్యాన్స్..!

by Azhar
Ad

బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ హీరోలలో అమీర్ ఖాన్ ఒక్కడు. అయితే అమీర్ ఖాన్ ను అందాహృ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు అనే విషయం తెలిసిందే. ఎందుకంటే.. అమీర్ ఖాన్ ఇండియాలో ఉండే అందరి హీరోల కంటే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. తాను ఒక్క సినిమా అనేది చేసేముందు ఒక్కటి పది సార్లు ఆలోచిస్తాడు అనేది తెలిసిందే. అలాగే ప్రతి సినిమా విడుదల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఈ క్రమంలోనే కొంతమంది అమీర్ ఖాన్ ను ప్రేమిస్తే మరికొందరు ద్వేషిస్తారు. ఇక అమీర్ ఖాన్ బాలీవుడ్ లో జరిగే ప్రతి అవార్డు ఫంక్షన్ కు కూడా దూరంగా ఉన్నాడు అనేది తెలిసిందే.

Advertisement

అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ కొత్తగా లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో ప్రజల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో మన తెలుగు హీరో నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాను మొత్తం ఇండియా వైడ్ గా అన్ని భాషలో విడుదల చేస్తున్నారు. అందుకు తగ్గిన విధంగా అమీర్ ఖాన్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇక మన తెలుగులో ఈ సినిమాను చిరంజీవి సమర్పిస్తున్నారు. అయితే ఈ మధ్యే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ను అమీర్ ఫ్యన్స్ వైరల్ చేస్తున్నారు. అవి చిరుని ఇబ్బందిలో పడేస్తున్నాయి.

Advertisement

అయితే చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాథర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాకు సల్మాన్ ను ఎందుకు ఎంపిక చేసారు అను అమీర్ ప్రశ్నించగా.. చిరు ఇది మెదడుతో హృదయంతో చేసే పాత్ర కాదు. బాడీతో చేసే పాత్ర అని చెప్పాడు. దాంతో ఈ కామెంట్స్ ను వైరల్ చేస్తూ.. ఒక్క మీర్ సినిమాలో మెదడుతో హృదయంతో చేస్తూ అలా ఆలోచించే సినిమాలు. సల్మాన్ వి కేవలం బాడీతో చేసే సినిమాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే చిరుకి ఇబ్బందిగా మారింది. అయితే చిరంజీవి మాత్రం సల్మాన్ ఎక్కువగా చేసే యాక్షన్ సినిమాలను ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేసాడు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

సెంచరీలు చేసినప్పుడు మాట్లాడలేదు… ఇప్పుడు కూడా మాట్లాడకూడదు..!

వన్డే ఫార్మట్స్ లో ఓవర్లను కుదించనున్నారా…?

Visitors Are Also Reading