Home » చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో ర‌జినీ రికార్డులు బ్రేక్ చేశాడు..! ఆ సినిమా ఏంటో తెలుసా..?

చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో ర‌జినీ రికార్డులు బ్రేక్ చేశాడు..! ఆ సినిమా ఏంటో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

కొన్నిసార్లు హీరోలు రిజెక్ట్ చేసిన క‌థ‌లు రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఆ త‌ర‌వాత సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధ‌ప‌డుతుంటారు. అలా మెగాస్టార్ కూడా తన కెరీర్ లో చాలా సినిమాల‌ను మిస్ అయ్యారు. అంతే కాకుండా చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థ‌తో రజినీకాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఏంటి..? అస‌లు చిరంజీవి అంత‌మంచి క‌థ‌ను ఎలా ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న సంగ‌తి ఇప్పుడు చూద్దాం….

Advertisement

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్, సురేష్ గోపి ప్రధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం మ‌ణిచిత్ర తాల్…ఈ సినిమాలో శోభ‌న హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా 1993లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాకు రీమేక్ గా 2004 లో క‌న్న‌డ లో ఆప్త‌మిత్ర అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో సౌంద‌ర్య హీరోయిన్ గా న‌టించింది. సినిమాలో విష్ణువర్థ‌న్ హీరోగా న‌టించారు. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.

 

Advertisement

ఇదిలా ఉంటే ఇదే సినిమాను త‌మిళ్ లో రజినీకాంత్ హీరోగా చంద్ర‌ముఖి అనే టైటిల్ ల్ తో తెర‌కెక్కించారు. అంతే కాకుండా ప్ర‌భు ముక్య‌పాత్ర‌లో న‌టించాడు. సినిమాలో జ్యోతిక‌, న‌య‌న‌తార‌లు హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమాకు మొద‌ట నాగ‌వ‌ళ్లి అనే టైటిల్ ను అనుకున్నారు.కానీ ర‌జినీకాంత్ చంద్ర‌ముఖి అనే టైటిల్ ను సూచించ‌డంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2005లో వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ లో జోతిక న‌ట‌న‌కు వ‌ణికిపోయారు.

 

ఇదే సినిమాను తెలుగులో కూడా డ‌బ్ చేయ‌గా ఇక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే నిజానికి ద‌ర్శ‌కుడు విఎన్ ఆదిత్య ఆప్త‌మిత్ర సినిమా చూడాల‌ని చిరంజీవికి ముందుగానే సీడీని పంపించాడు. ఆ సినిమా చూసిన చిరు రిజెక్ట్ చేశాడు. కానీ చంద్ర‌ముఖి విడుద‌ల‌య్యాక చిరు విఎన్ ఆదిత్య‌కు ఫోన్ చేసి ఆయ‌న జెడ్జిమెంట్ ను అభినందించాడు. అలా చిరు రిజెక్ట్ చేసిన క‌థ‌తో ర‌జినీ రికార్డులు క్రియేట్ చేశాడు.

ALSO READ: హ‌రికృష్ణ రెండేళ్ల‌పాటూ ఎన్టీఆర్ తో ఎందుకు మాట్లాడ‌లేదు…? దానికి కార‌ణం ఎవ‌రు…?

Visitors Are Also Reading