సాధారణంగా ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు అందరూ బేరాలు చేయడం సహజం. కానీ అదే వస్తువును సూపర్ మార్కెట్ లో మాత్రం ఎవ్వరూ కూడా బేరాలు చేయరు. ఎందుకంటే అక్కడ ఫిక్స్‌డ్ ధర ఉండడం వల్ల వారు బేరం చేయడానికి వీలుండదు. కానీ రైతులు, పేదలు, వ్యాపారస్తుల వద్ద మాత్రం ప్రతి ఒక్కరూ బేరసారాలు చేస్తుంటారు. అందుకే పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉంటున్నారు. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్‌లలో వస్తువులను కొనుగోలు చేయకూడదు. రైతులు, వ్యాపారస్తుల వద్దనే కొనుగోలు చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే కారులో వెళ్లుతూ మొక్కజొన్న కంకులను చూసి తన వాహనాన్ని ఆపారు. వెంటనే బండి దగ్గరికీ వెళ్లి మూడు మొక్కజొన్న కంకులను కాల్పించుకుని ఉప్పు రాయించుకున్నారు. ఇక ఆ తరువాత ఒక్క కంటి ఎంత అని విక్రయదారుడిని కేంద్ర మంత్రి అడిగారు. ఒక్క దానికి రూ.15 అని విక్రయదారుడు సమాధానం చెప్పారు. మూడు కంకులకు రూ.45 అని చెప్పగా.. ఇంత ధరకు విక్రయిస్తావా అని మంత్రి విక్రయదారుడిని ప్రశ్నించారు. అందుకు విక్రయదారుడు ప్రతిస్పందించాడు.
Advertisement
आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU
— Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022
రూ.15 అన్నది స్టాండర్డ్ ధర. మీకు కారు ఉందని చెప్పి ధరను పెంచలేదని సమాధానం చెప్పాడు. దీంతో ఇక్కడ మొక్కజొన్న ఉచితంగా లభిస్తుందని తెలుసా అని మంత్రి కులస్తే ప్రశ్నించారు. చివరికి ఆ కంకుల ధరను చెల్లించి వచ్చేశారు. ఈరోజు సియోని నుంచి మాండ్లాకు వెళ్లుతు్నాను. స్తానిక మొక్కజొన్న రుచి చూశాను. మనమందరం కలిసి స్థానిక రైతులు, దుకాణదారుల నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధిని కల్తీ లేని వస్తువులను నిర్థారిస్తుందని కులస్తే ట్వీట్ చేసారు. మరొక వైపు మొక్కజొన్న కోసం మంత్రి బేరాలు ఆడిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రికి పెరిగిన ధరల మంట తెలిసి వచ్చిందన్న కామెంట్లు చేస్తున్నారు.
Also Read :
నేషనల్ వైడ్‌గా వైరలవుతోన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు థమన్..!
మేషరాశి వారి రాశి ఫలాలు ఆగస్టులో ఎలా ఉన్నాయంటే..?