మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తేదీ వరకు కలిసి ఉండి, ఆ తరువాత కుజుడు వృషభంలోకి వస్తున్నాడు. మిథునంలో ఉన్న శుక్రుడు 7వ తేది నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఇక వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీన రాశిలో గురుడు ఉన్నారు. ఈ గ్రహ స్తితిని అనుసరించి మేషరాశి వారికి 2022 ఆగస్టు నెల రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఆగస్టు నెలలో మేషరాశిలో రాహువు ఉన్నాడు కాబట్టి చేసే పనిలో కాస్త ఒత్తిడి ఉంటుంది. అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. సీరియస్ విషయాలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉంటారు. 11వ తేదీ తరువాత సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనం విషయంలో చక్కగా ఉంది. కుటుంబ సహకారం కొన్ని రంగాల్లో ధనాన్ని సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్స్ రైతులకు దనయోగం కలుగనుంది. వాహనాలను కొనుగోలు చేసే అవకాశముంది. 7వ తేదీ తరువాత రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. హోంలోన్స్, బిజినెస్ లోన్స్ కోసం ప్రయత్నించే లోన్స్ ఫలిస్తాయి.
Advertisement
మేషరాశి వారికి రాజకీయ విషయంలో సంతాన విషయంలో 11వ తేదీ నుంచి చక్కగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశముంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. టీచర్, లాయర్లకు సంబంధించిన వాటిలో చక్కటి అవకాశాలు రానున్నాయి. ఇక వ్యాపార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉండాలంటే చేయాల్సిన దేవతారాధన ఏమిటంటే సూర్యభగవానుడిని ఆరాధించాలి. కుమారస్వామి స్తోత్రాలను చదవాలి. ఈ విధంగా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.
Also Read :
నేషనల్ వైడ్‌గా వైరలవుతోన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు థమన్..!
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వారితో ఆచితూచి వ్యవహరించాలి