Home » వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్!

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్!

by Bunty
Ad

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ… వాట్సప్ ఉంటున్న సంగతి తెలిసిందే. జియో వచ్చినప్పటినుంచి… మొబైల్ ఫోన్ల వాడకంతో పాటు… డిజిటల్ పేమెంట్ లు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ వాడే వారికి.. గుడ్ న్యూస్ చెప్పింది ఆ సంస్థ. ఇకనుంచి వాట్సాప్ నుంచి క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్ ఉంది. నగదు బదిలీ చేసినప్పుడు ఏకంగా 50 ఒక రూపాయలు క్యాష్ బ్యాక్ అందించేందుకు సిద్ధం అయింది వాట్సాప్.

Advertisement

Advertisement

అయితే కేవలం ఒక రూపాయి పంపించినా కూడా క్యాష్ బ్యాక్ లభించడం గమనార్హం. ఈ ఆఫర్ ఐదు ట్రాన్సాక్షన్ ల వరకు మాత్రమే వర్తిస్తుందని షరతు పెట్టింది వాట్సప్. డబ్బులు పంపించిన వెంటనే ఆ క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ కానుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం అందుతోంది.

గతంలో ఫోన్ పే, గూగుల్ పే సైతం మొబైల్ పేమెంట్ ప్రారంభించిన సమయంలో క్యాష్ బ్యాక్ అందించాయి. దీంతో అవి వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. వాటి తరహాలోనే వాట్సప్ కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను తీసుకు వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక అటు వాట్సప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో వినియోగదారులు తెగ ఖుషి అవుతున్నారు.

Visitors Are Also Reading