సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ప్రతి సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ లు కనిపిస్తుంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అలా టాలీవుడ్ లో ఒకప్పుడు నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. వారిలో గంగోత్రి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు. సినిమాలో వల్లంకి పిట్ట పాటకు తన క్యూట్ క్యూట్ ఎక్స్పెషన్స్ తో ఆకట్టుకున్న చైల్డ్ పేరు కావ్య. ఈ సినిమాతో పాటూ కావ్య పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలో కూడా నటించి ప్రశంసలు అందుకుంది.
Advertisement
అంతే కాకుండా అడవిరాముడు, విజయేంద్ర వర్మ, అందమైన మనసులో ఇలా చాలా సినిమాల్లోనే నటించి అభిమానులను సొంతం చేసుకుంది. దాదాపుగా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా 12 సినిమాల్లో నటించి అలరించింది. ఇక ఆ తరవాత చదువుల కోసమని సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ చదువులను పక్కన పెట్టకుండా పూణే లో లా పూర్తిచేసి లేడీ వకీల్ సాబ్ అయ్యింది.
Advertisement
ఇక ఆ తరవాత మళ్లీ సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ చదువుతో పాటూ యాక్టింగ్ డ్యాన్స్ లోనూ ఇప్పటికే శిక్షణ కూడా తీసుకుంది. ఇక అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూణేలో చాలా తెలుగు సినిమాలు చూశానని చెప్పింది. తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని కానీ సినిమాల వల్ల చదువుకోలేదు అనే బాధ ఉండకూడదనే ముందు చదువు పూర్తిచేశానని చెప్పింది.
ప్రస్తుతం డిజిటల్ లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తానని కావ్య చెబుతోంది. తనకు తెలుగు వచ్చు కాబట్టి అది టాలీవుడ్ లో నటించడానికి అడ్వాంటేజ్ అవుతోందని చెప్పింది. తను తెలుగుతో పాటూ మలయాళం ఆడిషన్స్ ఇస్తున్నట్టు తెలిపింది. చూడాలి మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన కావ్య నటిగా ఏ మేర సక్సెస్ అవుతుందో.