ప్రస్తుతం భారత జట్టు గురించి ఎక్కడ చర్చ వినిపించిన.. అందులో మొదట విరాట్ కోహ్లీ ఆటతీరు గురించి.. ఆ తర్వాత జట్టు యొక్క కెప్టెన్ల మార్పు గురించే చర్చ అనేది వస్తుంది. ఈ ఏడాదిలో గడిచిన ఏడు నెలలలో ఏడుగురు కెప్టెన్లను వాడింది బీసీసీఐ. అందుకే టీం ఇండియా అనేది ఏ సిరీస్ కైనా సనౌన్సు కాగానే.. అప్పట్లో ఆటగాళ్లు ఎవరు ఉన్నారు అని చూసే అభిమానులు ఇప్పుడు కెప్టెన్సీ ఎవరు చేస్తున్నారు అని చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో టీం ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నా ఆటగాడు పుజారా కూడా కెప్టెన్ గా మారిపోయాడు.
Advertisement
కానీ అది టీం ఇండియాకు కాదు. అయితే 2020 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత పుజారా తన ఫామ్ అనేది కోల్పోయాడు. అందువల్ల అతడిని జట్టు నుండి కూడా తప్పించింది బీసీసీఐ. కానీ ఆ తర్వాత దేశవాళీ రంజీలలో మంచి ప్రదర్శన అనేది చేసిన పుజారా… ఆ తర్వాత ఐపీఎల్ లో అమ్ముడుకాకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ అనేది ఆడటం ప్రారంభించాడు. ఇక అక్కడ ఈ ఏడాది సక్సెస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పుజారా. అయితే ఈ టోర్నీలో పుజారా తన విశ్వరూపాన్ని చూపించాడు అని చెప్పాలి. అక్కడ సక్సెస్ జట్టు తరపున ఆరు మ్యాచ్ లలో 9 ఇన్నింగ్స్ ఆడాడు.
Advertisement
అయితే ఆ 9 ఇన్నింగ్స్ లోనే మొత్తం రెండు సెంచరీలు, నాలుగు డబల్ సెంచరీలు అనేవి సాధించాడు పుజారా. దాంతో పుజారా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అని అందరికి అర్ధం అయ్యింది. ఇక ఆ తర్వాత పుజారాకు ఇంగ్లాండ్ తో జరగబోయే 5వ టెస్టుకు పిలుపురావడంతో అక్కడే మన జట్టులో చేరి.. ఆయా టెస్టులో ఒక్క హాఫ్ సెంచరీ చేసాడు. ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ సక్సెస్ జట్టుతో కలిసాడు. అయితే ఇప్పుడు ఈ జట్టు యొక్క కెప్టెన్ టామ్ హైన్స్ గాయం బారిన పడ్డాడు. దాంతో సక్సెస్ జట్టు యాజమాన్యం తమ కెప్టెన్ గా పుజారాను నియమించుకుంది. మరి ఆటగాడిగా ఆ జట్టుకు అద్భుతం చేసిన పుజారా కెప్టెన్ గా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :