Home » విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్ దంపతులు.. తన భార్య అలా చేయడమే కారణమా..?

విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్ దంపతులు.. తన భార్య అలా చేయడమే కారణమా..?

by Sravanthi
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎలాంటి వార్త పేలుతుందో మనకు అర్థం కాదు. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది దంపతులు మనస్పర్థలు వచ్చి విడిపోయి మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు.ఈ విషయాన్ని వారు చాలా కామన్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఇండస్ట్రీలో రోజు రోజుకు పెరిగిపోతోంది.

Advertisement

Advertisement

 

ఇప్పటికే సమంత, నాగ చైతన్య విడాకుల విషయం తెర మీద ఉన్న సమయంలో, మల్లి స్టార్ డైరెక్టర్ దంపతులు విడిపోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే.. శ్రీను వైట్ల. ఈ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని ప్రచారం సాగుతోంది. ఈ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ సినిమాలు తీసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎంతో మంది సీనియర్ మరియు యంగ్ జనరేషన్ హీరోలతో ఈయన వర్క్ చేసిన సినిమాలు హిట్ అవడంతో శ్రీనువైట్ల చాలా పాపులర్ డైరెక్టర్ అయ్యారు.
కానీ ప్రస్తుత కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ డైరెక్టర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన భార్య రూప వైట్లకు కూడా ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే ఈ ఇద్దరి దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఈ పరిస్థితి విడాకులు తీసుకునే వరకు వచ్చిందని వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో అబద్దమో ఉందో తెలియదు కానీ,ఈ విషయంపై డైరెక్టర్ శ్రీనువైట్ల గాని అతని భార్య గాని స్పందించి క్లారిటీ ఇచ్చే వరకు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి.

 

ALSO READ:

Visitors Are Also Reading