Home » చిరంజీవి ఇచ్చిన ఆ గిఫ్ట్ ‘కృష్ణ వంశీ’ గారి ప్రాణాలను కాపాడిందా.. ? ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి ? ఆ స్టోరీ ఇదే..!

చిరంజీవి ఇచ్చిన ఆ గిఫ్ట్ ‘కృష్ణ వంశీ’ గారి ప్రాణాలను కాపాడిందా.. ? ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి ? ఆ స్టోరీ ఇదే..!

by AJAY
Ad

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు. చిరు సినిమాలను చూసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన యంగ్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలో చాలా మంది ఎంట్రీస్తుంటారు. ఇక చిరంజీవి సినిమాలనే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

Advertisement

తాజాగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కూడా చిరుతో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాల పరంగానే కాకుండా చిరు అంటే వ్యక్తిగతంగా కూడా తనకు ఇష్టమని కృష్ణవంశీ వెల్లడించారు. తోటి నటినటులను కూడా చిరంజీవి గౌరవంగా చూసుకుంటారని తెలిపారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు చిరంజీవి అలాగే ఉన్నారని తెలిపారు. అందుకే చిరు అంటే తనకు చాలా గౌరవమని పేర్కొన్నారు.

Advertisement

పర్సనల్ గా కూడా చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. కష్టకాలంలో గోవిందుడు అందరివాడేలే సినిమాను ఇచ్చారని చెప్పారు. గతంలో చిరంజీవితో కలిసి ఓ యాడ్ చేశానని డబ్బింగ్ సమయంలో అన్నయ్య మీకు బాగా నచ్చిన వ్యక్తికి మీరు కారు గిఫ్ట్ గా ఇస్తారా..? అని సరదాగా అడిగానని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి తనను ఇంటికి పిలిచి కారు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పరని…. దానికి తాను వద్దనట్టు తెలిపారు.

నాకు బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు ఒకవేళ ఇచ్చినా నా దగ్గర ఎక్కువ కాలం ఉండవు అని చెప్పానని అన్నారు. అన్నయ్యా అంటున్నావ్ ….అన్న ఇస్తే వద్దంటావా అని అన్నారని దాంతో…మొహమాటపడుతూనే తీసుకున్నానని తెలిపారు. ఇక ఆ కార్ తో ఎన్నో సాహసాలు చేశానని అన్నారు. అంతేకాకుండా ఓసారి నందిగామ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని కానీ చిన్న చిన్న గాయాలతో భయటపడ్డానని అన్నారు. చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ వల్లే తను ప్రాణాలతో బయటపడ్డానని కృష్ణ వంశీ వెల్లడించారు.

Also read : రూ.150 కోట్లకు పైగా బ‌డ్జెట్ మించిపోయిన టాప్ 5 సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading