పంచభూతాలలో ఒక్కటైన అగ్ని ఎన్నో కర్మలకు సాక్షి భూతం అని మన పురాణాలలో చెప్పారు. అగ్ని అంటే పవిత్రతకి,శక్తికి మారుపేరు. వేదాల్లో అగ్నిదేవుడు దేవతలకు పురోహితుడు అని చెప్పబడింది. అగ్నిదేవుడు ఆగ్నేయానికి దిక్పాలకుడు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం చేస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూర్తి వివరాలకు వెళ్తే.
‘‘సోమ: ప్రధమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తర:”
త్రుతీయాగ్నిష్టే పతి: తురీయప్తే మనుష్య చౌ:”
Advertisement
ఓ అమ్మాయి నిన్ను ప్రారంభ కాలంలో సోముడు, దాని తర్వాత గంధర్వుడు, ఆ తరువాత అగ్ని వశపరుచుకొని కాపాడారు. ఇక నాలుగో వాడిగా నిన్ను నా దానిగా చేసుకొని, జీవితాంతం నీకు ఏ కష్టం రాకుండా ఏలు కుంటానని అని అర్థం వస్తుంది. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలన చూసేది సోముడు అంటే చంద్రుడు. చంద్రుని ఎన్నిసార్లు చూసినా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడో, అలాగే ఆ పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగడానికి గల కారణం ఆ పాప చంద్రుని పాలనలో ఉండటం వలన. ఆమె కొంత వయసు వచ్చాక చంద్రుడు ఆమెను గంధర్వుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆమెను చంద్రుడి సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు. ఇక గంధర్వుడు ఆమెలో ఆకర్షణీయమైన అందాన్ని ప్రవేశపెడతాడు.
Advertisement
గంధర్వులు అంటే గాన ప్రియులు కాబట్టి సంగీతాన్ని ఇష్టపడే మనసుని కూడా ఆమెకు ఇస్తాడు. ఇలా ఇవి రెండు ఇచ్చి నా పని అయిపోయింది, ఇక నీదే పూచి అని ఆ కన్యను అగ్నిదేవునికి అప్పజెప్పి గంధర్వుడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమెను అగ్నిసాక్షిగా అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. ఇక అగ్నిదేవుడు ఆమె శరీరంలోకి కామ గుణాన్ని ప్రవేశపెడతాడు. అలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణను, గంధర్వుని ద్వారా లావణ్యతను, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇక ఆ కన్య వివాహానికి యోగ్యురాలు అని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్లాలి కనుక వివాహ సమయంలో ఆ కన్యను వరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు.
ALSO READ:
ANR తో కలిసి చేసిన ఈ నలుగురు స్టార్స్ సినిమాలు అట్టర్ ఫ్లాప్…ఆ సినిమాలు ఎవంటే..?
కాస్త ఫేమ్ రాగానే సెలబ్రెటీల మాదిరిగా ఫీల్ అవుతున్నారు…లైవ్ లో సుధీర్ పరువు తీసిన ఏడుకొండలు…!