మెసెజింగ్ యాప్ అనగానే ఫస్ట్ ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చే వాట్సాప్. అంతలా యూజర్లను అట్రాక్ట్ చేసింది ఈ యాప్. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఎక్కువమంది ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ తొలిస్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది వాట్సాప్. అందుకే వాట్సాప్‌కి ఇంత క్రేజ్ ఉంది. రోజు రోజుకు పోటి పెరుగుతున్న తరుణంలో కూడా పోటీని సైతం తట్టుకునే క్రమంలో వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది.
సాధారణంగా వాట్సాప్ స్టేటస్‌లో వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్‌లను పోస్ట్ చేస్తుండడం మనందరికీ తెలిసినదే. వాట్సాప్ ఇప్పుడు దీనికి కొత్తగా మరొక ఆప్షన్‌ను తీసుకొస్తుంది. యూజర్లు ఇక నుంచి తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియోను నేరుగా స్టేటస్ లో పోస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పాడ్ కాస్ట్‌లకు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఈ తరుణంలోనే యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది. నచ్చిన ఫోటో, వీడియో పోస్ట్ చేసి దానిపై ఆడియో రూపంలో కూడా కామెంట్ చేయవచ్చన్నమాట.
Advertisement
Advertisement
ప్రస్తుతం వాట్సాప్ బార్ ను క్లిక్ చేయగానే కెమెరా, టెక్ట్స్ ఫీచర్లు కనిపిస్తున్నాయి. ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆడియో స్టేటస్ పోస్ట్ చేసేందుకు వీలుగా మైకు సింబల్ కనిపిస్తుంది.దీంతో నేరుగా వాయిస్ రికార్డు చేసుకొని స్టేటస్ లో పోస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారట.
Also Read :
ముత్యాల్లాంటి NTR చేతిరాత…ప్రింట్ కాదండోయ్!
ఈ పేరు గల అమ్మాయిలు చాలా లక్కీ.. వారు ఏం కోరుకుంటే అది నేరవేరుతుంది