ఈ భూమండలన్ని అంతా కాపాడే పరమ పవిత్రమైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శివుడే. ఆయాన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటుంటారు. అలాంటి పరమశివుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడతాడు. మల్లికార్జున స్వామి, బోలా శంకరుడు, ఈశ్వరుడు, నీలకంఠేశ్వర స్వామి, లింగోద్భవడు, లింగ స్వరూపుడు ఇంకా అనేక పేర్లు ఆయనకు ఉన్నాయి. శివుని నిష్టతో పూజింస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుస్తాడు. శివునికి చాలా ఇష్టమైన రోజు సోమవారం. ఈ రోజున మనం భక్తిశ్రద్ధలతో శివుడికి ఇష్టమైన టువంటి బిల్వపత్రాలతో పూజ చేయాలి.
Advertisement
ఈ పత్రాలపై శ్రీరాముడు అని రాసి లింగం పైన ఉంచి కోరికలు కోరుకుంటే అవి త్వరగా నెరవేరుతాయని. ఇందులో ముఖ్యంగా మూడు ఆకులు కలిసి ఉన్నటువంటి బిల్వపత్రాలను పెడితే ఆయనకు చాలా ఇష్టమట. అలాగే శివుడిని కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అలాగే శివయ్యకు నంది అంటే చాలా ఇష్టం నంది వాహనంపై విహారం చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి శివాలయంలో తప్పనిసరిగా నంది విగ్రహం ఉంటుంది. మన కోరికలను నంది చెవిలో ఇలా చెబితే ఆయన శివుడికి చేరవేస్తారు అని అవి మనకు నెరవేరుతాయని నమ్ముతారు.
Advertisement
ముందుగానే శివాలయంలోకి వెళ్ళినప్పుడు గర్భగుడి ముందు ప్రదక్షిణలు చేయకుండా, ముందు నందీశ్వరుని దగ్గర ప్రదక్షిణాలు చేసి శివుని దగ్గరికి రావాలి. తర్వాత గర్భ గుడిలో లింగాన్ని అభిషేకించాలి. ఎప్పుడైనా సరే బోలా శంకరుడిని మొగలి పూలతో, సంపంగి, నాగమల్లి, మల్లెపూలు వంటి పూలతో అస్సలు పూజించకూడదు. బిల్వ పత్రాలతో పూజ చేస్తే మన సమస్యలు అన్ని తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటుంటారు.
also read:
- వర్షాకాలంలో ఈ ఐదు రకాల జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..!
- వేణుమాదవ్ 10 ఎకరాల భూమితో పవన్ కల్యాణ్ కు ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా…?