Home » అప్పు తీసుకునేప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ.. ఈ నియమాలు తప్పనిసరి.. లేదంటే నష్టమే..?

అప్పు తీసుకునేప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ.. ఈ నియమాలు తప్పనిసరి.. లేదంటే నష్టమే..?

by Sravanthi
Ad

సాధారణంగా మనం అవసరాల నిమిత్తం ఒక్కోసారి అప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి మన దగ్గర ఉంటే మిగతా వాళ్లకు అప్పులు కూడా ఇస్తూ ఉంటాం. ఈ విధంగా అప్పు ఇచ్చేటప్పుడు గాని, తీసుకునేటప్పుడు కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి అప్పు ఇవ్వాలి.. ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి.. అనే విషయాలను చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒక సారి అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. అది ఒక వ్యక్తి దగ్గర కానీ లేదంటే ఏదైనా సంస్థ దగ్గర కానీ అప్పుగా తీసుకుంటాం.

Advertisement

తీసుకున్న అప్పు ఒక్కొక్కసారి సమస్యగా మారుతుంది. అది ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్లకి ఇద్దరికీ సమస్య గా మారడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక కారణాలున్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల వారు అప్పులు చేయకూడదు. మరి వారెవరో ఓ సారి చూద్దాం. భారత పంచాంగం ప్రకారం హస్త నక్షత్రం కలిగి ఉన్నటువంటి వారు చేసిన అప్పు తీర్చడం కష్టమే. అదేవిధంగా కృత్తిక, విశాఖ, జ్యేష్ట, మూల, ఆద్రా, రోహిణి, మూల, ఉత్తరాషాఢ, ఇలాంటి నక్షత్రాలలో పుట్టిన వారు అప్పులు చేయకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని వారాలు కూడా అప్పుల ఇవ్వటం మరియు తీసుకోవడం మంచి, చెడుగా భావిస్తూ ఉంటారు.

Advertisement

 

ఎవరైనా సరే ఋణం తీసుకోవడానికి మంగళవారం అనేది చాలా మంచి రోజు. ఈరోజు అప్పు చేస్తే తొందరగా తీరుతుంది. బుధవారం రోజున ఎవరు కూడా అప్పు ఇవ్వకూడదు. ఈ రోజు అప్పు చేస్తే ఎప్పటికీ తీరదు. మన ఇచ్చిన అప్పు కూడా మళ్ళీ తిరిగి రావు. అప్పుడు తీర్చడానికి డబ్బులు ఉన్నా కానీ అవి ఇవ్వడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ప్రతి మంగళవారం రోజున పూర్ణ విశ్వాసంతో అరంగేట్రం ముక్త మంగళ స్థరాన్ని జపించాలి. ఈ విధంగా ఈ ఆంజనేయుడిని పూజిస్తే అప్పుల బాధలు తొలగుతాయి.

also read:

Visitors Are Also Reading