Home » వామ్మో.. ఇల్లు అద్దెకు తీసుకుని మోసం.. ఎలాగంటే..?

వామ్మో.. ఇల్లు అద్దెకు తీసుకుని మోసం.. ఎలాగంటే..?

by Anji
Ad

ఈ రోజుల్లో మంచి వారి కంటే ఎక్కువ‌గా మోసం చేసే వారే అధికంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మోసం చేసే వారు అధికంగా మంచివారు అని న‌మ్మించి మ‌రీ మోసం చేస్తున్నారు. మోసం చేయ‌డంతో అధికంగా డ‌బ్బు, బంగారం, న‌గ‌లు ఇలా ఏదో ఒక‌టి వ‌స్తాయ‌ని ఆవ చూపించి వ‌ల‌లో వేసుకోవ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు కేటుగాళ్లు. అలాంటి మోసం త‌మిళనాడు రాష్ట్రంలోని చెన్నై న‌గ‌రంలో ఓ భారీ ఘ‌రానా మోసం జ‌రిగింది. దాని గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

చెన్నైలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ త‌రువాత లక్ష‌ల‌కు లీజుకు ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో రూ.20కోట్ల‌కు పైగా మోసం చేసిన ముఠాపై 154 మంది బాదితులు డిప్యూటి క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేశారు. చెన్నై స‌మీపంలోనే ఉన్న‌టువంటి కోవిలంబాక్కంలోని సిండికేట్ బ్యాంకు కాల‌నీ రోడ్డు, భూప‌తిన‌గ‌ర్, ప‌ల్ల‌వ‌రం- దురైపాక్కం రేడియ‌ల్ రోడ్డులో చోళై ముత్తురాజా గురు రియ‌ల్టి అసోసియేష‌న్ న‌డుపుతున్నాడు. ఈ కంపెనీ కొత్త‌గా నిర్మిస్తున్న ఇండ్ల‌ను లక్ష్యంగా చేసుకునేది. ఇంటి అద్దె నెల‌వారిగా చెల్లిస్తామ‌ని ఇంటి య‌జ‌మానుల‌తో ఒప్పందం కుదుర్చుకునేది. ఆ త‌రువాత ఇల్ల‌నే లీజుకు ఇస్తామ‌ని ఆన్‌లైన్ ఫ్లాట్ ఫార‌మ్ ఓఎల్ఎక్స్ ద్వారా ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌క‌ట‌న చూసి వంద‌లాది మంది రూ.4లక్ష‌ల నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించి ఇండ్ల‌ను లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విష‌యం అస‌లు ఇంటి య‌జ‌మానుల‌కు తెలియ‌కుండానే వీరితో అగ్రిమెంట్ చేసుకున్నారు.

Advertisement

త‌మ ఇండ్ల‌కు గ‌త కొద్ది నెల‌లుగా అద్దె చెల్లించ‌క‌పోవ‌డంతో ఇంటి య‌జ‌మానులు ఖాళీ చేయాల‌ని ఇంట్లో వారిని కోర‌డంతో.. మేము లక్ష‌లు చెల్లించి ఇంటిని లీజుకు తీసుకున్నాం. మీరు ఇల్లు ఖాళీ చేయ‌మంటారా..? అని ప్ర‌శ్నించారు. ఇక ఇంటి య‌జ‌మానులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. అస‌లు విష‌యం లీజుకు తీసుకున్న‌వారికి చెప్పారు. చోళై ముత్తురాజా గురు రియ‌ల్టీ అసోసియేట్స్ కి అద్దెకు ఇచ్చామ‌ని తెలిపారు. దీంతో తాము మోస‌పోయాం అని ఇరు వ‌ర్గాలు గుర్తించాయి. కొంత మొత్తం చెల్లించి ఇంట‌ని అద్దెకు ఇస్తున్న‌ట్టుగా య‌జ‌మానితో అగ్రిమెంట్ చేసుకున్న ముత్తురాజా మ‌రో ప‌క్క ఇల్లు ఖాళీగా ఉంద‌ని ప్ర‌చారం చేస్తూ ఇంటికి వ‌చ్చిన వారిని టార్గెట్ చేసి లీజుకు ఇచ్చే విదంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.


సంవ‌త్స‌రాల పాటుతో లక్ష‌ల్లో డ‌బ్బులు తీసుకుని ఇండ్ల‌ను లీజుకు అప్ప‌గించేవారు మోస‌పోయిన వారి సంఖ్య 150కి పైగా ఉంది. 154 మంది త‌మ డ‌బ్బును తిరిగి ఇప్పించాల‌ని చెన్నైలో ప‌న‌యూర్ ఈస్ట్యూర్ ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ప‌ల్లికా రాణి డిప్యూటి క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. రియ‌ల్టీ అసోసియేష‌న్ య‌జ‌మాని చోళై ముత్తురాజా, అత‌ని స‌హాయ‌కులు ప‌రారీలో ఉన్నారు. పెరుంబాక్కం, చోషింగ‌న‌ల్లూర్, దురైపాకం, తిరువాన్మియూర్, సెమ్మంచెరి, వెల‌చ్చేరి, ప‌ల్ల‌వ‌రం, ప‌ల్లికార‌ని, కేతువంకేణి, అడ‌యార్ స‌హా ప‌లు ప్రాంతాల్లో 150కి పైగా ఇండ్ల‌ను గురు రియ‌ల్టీ అసోసియేట్స్ ఆదీనంలో ఉంచుకుని 20కోట్ల‌కు పైగా డ‌బ్బులు తీసుకుని పరారీలో ఉన్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

వ‌ర్షాకాలంలో ఈ ఐదు ర‌కాల జ్వ‌రాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..!

వేణుమాద‌వ్ 10 ఎక‌రాల భూమితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading