కొత్తగా పెళ్లి అయిన ఓ ఆడపిల్ల తన అత్తగారింటి వద్ద జరిగే విశేషాలను క్షుణ్ణంగా పూసగుచ్చినట్టు ఓ లేఖ ద్వారా తన తల్లికి వెల్లడించింది. తొలుత అమ్మా అని ఆప్యాయంగా ప్రారంభించింది. ఇక అందరూ ఆడపిల్లల మాదిరిగానే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. ఓ అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడని.. నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఎంతో ఊహించాను. కానీ ఆఈరోజు పెళ్లి జరిగిన తరువాత తెలిసింది. పెళ్లి అంటే పూల పానుపు కాదని.. నేను ఊహించదాని కంటే ఇక్కడ భిన్నంగా ఉన్నది. నాకోసం ఇక్కడ నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు రాజీలన్నీ ఎదురు చూస్తున్నాయి.
Advertisement
ఇక నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. ఇంట్లో నేను అందరికంటే ముందు నిద్రలేచి ఇంట్లో వాళ్లకు కావాల్సినవన్నీ సిద్ధం చేయాలని ఆశిస్తారు. మన ఇంట్లో మాదిరిగా పైజామాలతో రోజు అంతా ఇల్లంతా తిరగలేను. నాకుంటూ ఉన్న కొన్ని పద్దతుల ప్రకారం నేను నడచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్లలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు ఇప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు నిద్రించడానికి వీలే లేదు. ప్రతిక్షణం ఉత్సాహంగా, హుషారుగా ఉండి ఎవరెవరికీ ఏం కావాలో అన్ని చేసి పెడుతుండాలి. ఓ యువరాణిలాగా నాపై శ్రద్ధ తీసుకునే వారు ఇక్కడ ఎవ్వరు లేరు. కానీ నేను అందరి గురించి తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి.
Advertisement
నీ దగ్గరే సుఖంగా, హాయిగా ఉండక నేను అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది. ఒక్కోసారి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరే ఉండాలనిపిస్తుంటుంది. మన ఇంటికి వచ్చి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకుని తినాలని, సాయంత్రం స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్లాలని, ప్రపంచంలో ఏ బాధలు లేనట్టు నీ ఒడిలోనే నా తలపెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది. కానీ నాకు గుర్తుకు వచ్చింది. నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఓ ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చావు కదా అమ్మా. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు. నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని, శాంతిని, సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను మళ్లీ నేను అడుగు పెట్టిన నా మెట్టింటికి ఇవ్వాలి కదా అని గుర్తుకొచ్చింది. కొంత కాలం గడిచే వరకు నేను నీ లాగే నా కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు నా కృతజ్ఞతలు. నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావాల్సినంత శక్తిని, స్థైర్యాన్నిచ్చాయని ఓ కూతురు తన తల్లికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read :
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ఎర్ర చీమలు చేరితే అది దేనికి దారి తీస్తుందో తెలుసా ?
“పెళ్లి సందడి” సినిమా హీరోయిన్ రవళి గుర్తుందా…? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?