Home » “పెళ్లి సందడి” సినిమా హీరోయిన్ రవళి గుర్తుందా…? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

“పెళ్లి సందడి” సినిమా హీరోయిన్ రవళి గుర్తుందా…? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

by AJAY
Ad

ఒకప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తు పట్టలేనంత గా మారిపోతున్నారు. అయితే కొంతమంది రీ ఎంట్రీ ఇస్తు ఉండగా మరికొందరు మాత్రం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఫ్యామిలీ తోనే గడుపుతున్నారు. అలా పూర్తిగా స్క్రీన్ కు దూరం అయిన వాళ్ళ లిస్ట్ లో ఒకప్పటి హీరోయిన్ రవళి కూడా ఉన్నారు.

 

Advertisement

హీరోయిన్ రవళి పెళ్లి సందడి సినిమాలో నటించారు. శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తో శ్రీకాంత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇదే సినిమా లో రవళి శ్రీకాంత్ కు జోడిగా నటించిన అలరించింది.

Advertisement

అంతే కాకుండా పలువురు స్టార్ హీరోల తో కలిసి రవళి సినిమాలు చేసింది. అలా ఎన్నో సూపర్ హిట్ సినిమా లలో నటించిన తరవాత వెండి తెరకు దూరం అయ్యింది. కానీ ఇటీవల శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించింది. తనను ఎవరూ గుర్తు పట్టడం లేదు అని ప్రస్తుతం లావుగా అయ్యా అని అందువల్లేనేమో అంటూ వ్యాఖ్యానించింది.

ఇక ఇప్పుడు తాజాగా నేడు నటి,మంత్రి రోజా తో కలిసి రవళి తిరుమల దేవస్థానం లో సందడి చేసింది. స్వామి వారి దర్శనం అనంతరం మీడియా ముందు కనిపించింది. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రవళి ఇలా అయ్యింది ఏంటి అని షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం రవళి సినిమా లకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లో బిజీ గా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుండని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Visitors Are Also Reading