ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా ఆర్పీ, హైపర్ ఆది, రాంప్రసాద్ ఇలా పలువురు జబర్దస్త్ కామెడీలో నటించిన విషయం విధితమే. అయితే ఈ మధ్య కిరాక్ ఆర్పీ , హైపర్ ఆదిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆర్పీ జబర్దస్త్ లోంచి బయటికి వెళ్లిన తరువాత పలు ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ గురించి ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా మల్లెమాల సంస్థలో ఫుడ్ అసలు బాగుండదని, మధ్యాహ్నం అన్న మిగిలితే సాయంత్రం పులిహోర, అన్నంను అసలు పూర్తిగా ఉడకనివ్వరు. పులిహోర చేయడం కోసమే ఉడకకుండా ఉంచుతారేమో అనేది అర్థం కాదు. టీ అనేది మనిషి అనే వాడు ఎవ్వడూ తాగడు. ఇక ఫుడ్ అనేది రీజన్ కాదు కదా అని యాంకర్ అడగ్గా.. సినిమా ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీలో ఫుడ్ అటు ఇటు ఉండకూడదు. నీటుగా, క్లారిటీగా ఉండాలి. ఫుడ్ మంచిగా పెట్టడం ఒక రూల్. కొంత మంది టీమ్ లీడర్లు అక్కడ పెట్టే టిఫిన్ నచ్చక బయట సైకిల్ మీద తీసుకొచ్చే టిఫిన్ తింటుంటారు. దీనిపై హైపర్ ఆది ఇలా అన్నారు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఈ మాట చెబితే అది జన్యూన్. ఆకలి తీరాక ఆ మాట చెబితే అది చీటింగ్. అన్నదానం చేసే వారి వద్దకు వెళ్లి నాకు బిర్యాని పెట్టండి అంటే ఎలా ఉంటుంది అని ఆది ప్రశ్నించారు. ఆర్పీ కావాలనే చెప్పాడని రాంప్రసాద్ పేర్కొన్నారు. మల్లెమాల ప్రొడక్షన్ డబ్బులు ఎప్పుడూ కూడా ఆపదు.
Advertisement
యాంకర్‌ను నువ్వు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఆర్పీ ఇలా అన్నాడు అంటే నేను ఇక్కడే గుండు తీయించుకుంటానని ఆర్పీ పేర్కొన్నాడు. జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చి అక్కడ కూర్చోని మళ్లీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే నేను అడిగిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమని చెప్పు నేను గుండు తీయించుకుంటాను అన్నాడు అని యాంకర్ రాంప్రసాద్, హైపర్ ఆది లను ప్రశ్నించాడు. దీంతో రాం ప్రసాద్ మాట్లాడుతూ మేము ఆర్పీని పిలిపించి గుండు గీయించేందుకు మేము ఇక్కడికీ రాలేదు. ఆర్పీ చెప్పింది తప్పు అని చెప్పడానిరే ఇంటర్వ్యూకు వచ్చామని సమాధానం ఇచ్చాడు. ఆర్పీ ఆలోచించి అస్సలు మాట్లాడలేదు. ముక్కు సూటిగా మాట్లాడాడు.
జబర్దస్త్ మాకు లైఫ్ ఇవ్వడం కాదు. మేము కూడా జబర్దస్త్‌కి లైఫ్ ఇచ్చామని ఆర్పీ చెప్పాడు. సుధీర్ వాడు డబ్బులు తీసుకొని వెళ్లిపోతాడు కదా.. అర్థం పర్థం లేని విషయాలన్నింటిని తన మీద రుద్దుకోవడంతో అతని వల్ల ఎంత రేటింగ్ వచ్చిందో తెలిసిందే. సుధీర్ రష్మీల గురించి కావాలనే రుద్దారు. కేవలం జబర్దస్త్ షో రేటింగ్ కోసం రూమర్స్ క్రియేట్ చేశారు. ఒకరిది అవసరం. మాది అవకాశం ఇలా ఇద్దరు కలిస్తేనే పని జరుగుతుంది. ఇక రాంప్రసాద్, ఆది మల్లెమాల జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన మా జబర్దస్త్ టీమ్ లీడర్లు, టీమ్ మెంబర్స్ అందరికీ ఏదో ఒక సందర్భంలో చాలా సార్లు హెల్ప్ చేశారని గుర్తు చేశారు ఆది. మల్లెమాల వారు మనుషులను గౌరవించారు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉన్న అకస్మాత్తుగా సుధీర్ బయటికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవచ్చు. మేము అందరం చాలా సందర్భాల్లో కలుస్తుంటాం.మామూలుగా మాట్లాడుకుంటాం.
Also Read :
రాత్రి వేళలో పెరుగు ఎందుకు తినకూడదో మీకు తెలుసా..?