ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఓ హై హొల్టేజ్ మ్యాచ్ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం ఐసీసీకి కూడా బాగా తెలుసు. అందుకే ఈ మధ్య జరుగుతున్న ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్ జట్లు ఒక్కే గ్రూప్ లో ఉండేవిధంగా.. అలాగే ఈ రెండు జట్లు మొదటి మ్యాచ్ లోనే తలపడేలా షెడ్యూల్ అనేది ఫిక్స్ చేస్తుంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ లో ఆస్ట్రేలియా లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 లోను ఇండియా, పాకిస్థాన్ జట్లు తమ మొదటి మ్యాచ్ లోనే అక్టోబర్ 23వ తేదీన తలపడబోతున్నాయి. దాంతో ఈ మ్యాచ్ పై ఇప్పటినుండే చర్చ అనేది జరుగుతుంది.
Advertisement
అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది పాకిస్థాన్ జట్టుకు ఇండియాను ఓడించడం చాలా కష్టంగా మారుతుంది. ఎందకంటే ఇప్పుడు ఇండియా జట్టు అనేది చాలా బలంగా తయారవుతుంది. అలాగే వారు ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు తగ్గిన విధంగా తన పక్క ప్రణాళికలను వేసుకొని వస్తుంది అని అక్తర్ పేర్కొన్నాడు. అలాగే ఇండియా , పాకిస్థాన్ మ్యాచ్ అనేది మెల్‌బోర్న్ పిచ్ లో జరగబోతుంది.
Advertisement
ఈ మెల్‌బోర్న్ పిచ్ అనేది మ్యాచ్ జరిగే కొద్ది పేసర్లకు బాగా సహకరిస్తుంది. అందువల్ల ఈ మ్యాచ్ లో టాస్ అనేది చాలా కీలకం అవుతుంది. కాబట్టి పాకిస్థాన్ ఒకేవేళ ఈ మ్యాచ్ లో టాస్ అనేది గెలిస్తే.. తప్పకుండ బ్యాటింగ్ తీసుకోవాలని. అప్పుడే రెండవ ఇన్నింగ్స్ లో పాక్ పేసర్లు లాభం పొందవచ్చు అని అక్తర్ తెలిపాడు. అదే విధంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్ చూడటానికి కనీసం లక్ష యాభై వేళా మంది వరకు అయిన వస్తారు అని అక్తర్ అంచనా వేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన అన్ని టికెట్స్ అమ్ముడైపోయిన విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :