కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు.. మనం ఆ కూడు తినేది కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. ఆరోగ్యం బాగుంటే ఎలాంటి పనైనా మనం చేయవచ్చు. ఏది చేయాలన్నా ఆరోగ్యం అనేది తప్పనిసరి. అయితే ఈ హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. కూర్చున్న దగ్గరికి ఏది రావాలంటే అది వస్తుంది. కానీ ఆ ఒక్క సమస్య వారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తుందట.. అదేంటో ఆ హీరోయిన్స్ ఎవరో ఓ సారి చూద్దాం..?
సినిమా చేస్తే కోట్ల రూపాయలు, విలాసవంతమైన జీవితం,కార్లు, బంగ్లాలు, చుట్టూ పని వాళ్ళు ఇలా ఎన్నో వారికి అందుబాటులో ఉంటాయి. అన్నీ ఉన్నా మనశ్శాంతి అనేది లేకుంటే జీవితం వృధా. కానీ ఆ స్టార్ హీరోయిన్ల జీవితంలో ఇదే జరుగుతోంది.
శృతిహాసన్ :
ప్రస్తుతం శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కానీ గత కొద్దికాలం నుంచి ఆమె తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు గతంలో వెల్లడించింది .బ్యాలెన్స్ సమస్య నుండి బయట పడటం కోసం శృతిహాసన్ సమయానికి తినడం,నిద్రపోవడం, వ్యాయామం చేయడం లాంటి కసరత్తులు చేస్తోందట.
దీపికా పదుకొనే:
కొన్నేళ్లక్రితం లవ్ ఫెయిల్యూర్ వల్ల తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన దీపిక.. దీనికి తోడుగా ఒత్తిడితో మానసిక కుంగిపోయనని చెప్పింది. దీని నుంచి బయటపడడానికి ట్రీట్మెంట్ తో పాటు కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నానని ఆమె అన్నది. ఇలాంటి సమస్యలు మహిళలు చాలామంది అనుభవిస్తున్నారని వాటికోసం నేను లైవ్ లవ్ లాఫ్ సంస్థను స్టార్ట్ చేసి సోషల్ సర్వీస్ చేస్తున్నానని అన్నారు.
Advertisement
Advertisement
సమంత:
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కూడా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గతంలో వెల్లడించారు. నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంత డిప్రెషన్ లోకి వెళ్లారు. డాక్టర్ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుంది. పాలిమర్పస్ లైట్ ఎరప్షన్ తో కూడా బాధపడుతున్నట్టు వెల్లడించారు సమంత.
ఇలియానా :
జీరో సైజు బేబీగా ఇలియానా పేరు తెచ్చుకుంది. బాడీ డిస్మోర్ఫిక్ డిజాస్టర్ తో పాటుగా డిప్రెషన్లోకి వెళ్లానని ఆమె బాధ పడ్డారు. ఈ వ్యాధి వల్ల నేను అందంగా లేను నాలో చాలా లోపాలు ఉన్నాయని నాకు నేనే అనుకుంటూ చాలా బాధ పడ్డాను అని తెలియజేశారు. కొన్నేళ్ళ తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు అండతో ఈ సమస్య నుండి బయట పడ్డానని తెలియజేశారు ఇలియానా.
also read:
- దారుణంగా బుక్కైన నరేష్, పవిత్రా లోకేష్.. అక్కడ రమ్య రఘుపతిని గమనించారా..?
- డాడి సినిమాలో చిరంజీవి కూతురు గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి…!