Home » దారుణంగా బుక్కైన నరేష్, పవిత్రా లోకేష్.. అక్కడ రమ్య రఘుపతిని గమనించారా..?

దారుణంగా బుక్కైన నరేష్, పవిత్రా లోకేష్.. అక్కడ రమ్య రఘుపతిని గమనించారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవిత్ర లోకేష్,నరేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన వీరి వ్యవహారం ప్రస్తుతం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కి కూడా చేరుకుంది. ఎక్కడ చూసినా వీరి రచ్చే కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని, కలిసే ఉంటున్నారని వార్తలు అయితే చెక్కర్లు కొడుతున్నాయి.. ఈ తరుణంలోనే కొత్తగా బయటకు వచ్చింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి..

Advertisement

దీంతో ఈ విషయం ఇంకా రసవత్తరంగా మారిపోయింది. రమ్య తో విడాకులు తీసుకోకుండానే నరేష్,పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపణలు వచ్చిన తరుణంలో రమ్య చాలా దారుణంగా రియాక్ట్ అయ్యింది. నరేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన నరేష్ కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. ఈ విధంగా వీరి వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ తరుణంలోనే మైసూరు లోని ఒక హోటల్ లో పవిత్రా లోకేష్, నరేష్ ఉన్నారని తెలుసుకుని రమ్య పోలీసులు మరియు అక్కడి లోకల్ మీడియా తో సహా అక్కడి వెళ్లి హంగామా సృష్టించింది.

Advertisement

నరేష్ తో తీవ్రంగా గొడవకు దిగింది. ఈ క్రమంలోనే నరేష్,రమ్యను రెచ్చగొడుతూ ఈలలు వేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఉన్న సమయంలో రమ్య రఘుపతి చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది.అక్కడ పోలీసులు వారించడంతో నరేష్,పవిత్రా లోకేష్ ఒక లిఫ్టులో ఎక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. మరి ఈ వ్యవహారం ఎప్పుడు ఎండ్ అవుతుందో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.

also read:

Visitors Are Also Reading