ఒకప్పుడు సినిమాలు థియేటర్ లో విడుదలైన తర్వాత టీవీలో చూడాలి అంటే చాలా కాలం పట్టేది. సినిమా ఎప్పుడు విడుదల అయినా దానిని ఓ పండగ చూసుకుని ప్రసారం చేసేవారు. అలా దసరా…దీపావళి పండగ సమయాల్లో ఎక్కువ సినిమాలు టీవీలో ప్రసారమయ్యేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని సినిమాలు విడుదలైన పదిహేను ఇరవై రోజుల్లోనే ఓటీటీ లోకి వస్తున్నాయి. దాంతో ఓటీటీ సంస్థలకు చెందిన టీవీ ఛానల్ టీవీలో కూడా సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇక కొత్త సినిమాలు టీవీ లో వస్తుండడంతో జనాలు కూడా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు. దాంతో సినిమాల రేటింగ్ కూడా భారీగా పెరిగిపోతోంది. అంతే కాకుండా టీవీ ఛానల్ లు కూడా హార్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు 2021లో విడుదలై టీవీలో ఎక్కువ రేటింగ్ సంపాదించిన సినిమాలు ఏవో చూద్దాం…
Also Read: అఖండ సినిమాలో కీ రోల్ చేసిన ఈ నటి ఎవరో తెలుసా…?
Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయింది. కాగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 19.12 రేటింగ్ వచ్చింది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయింది. ఈ సినిమా మొదటి సారి ప్రసారం అయినప్పుడు 18.51 రేటింగ్ వచ్చింది.
Advertisement
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయింది. ఈ సినిమాకు మొదటి సారి 11.71 రేటింగ్ వచ్చింది.
నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాగా 10.90 రేటింగ్ సొంతం చేసుకుని.
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన జార్జి రెడ్డి సినిమా స్టార్ మాలో ప్రసారం అయింది. కాగా ఈ సినిమాకు 9.7 రేటింగ్ వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా జెమినీ టీవీలో ప్రసారం అయింది. కాగా ఈ సినిమాకు 7.8 రేటింగ్ వచ్చింది.
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా జెమినీ టీవీలో ప్రసారం అయింది. ఈ సినిమాకు మొదటి సారి 9.7 రేటింగ్ వచ్చింది.
Also Read: మా అసోసియేషన్ విజయశాంతిని ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా..?