Home » సుధీర్ అంటే ఆ యువతికి అంత పిచ్చా.. మరి అక్కడ పచ్చబొట్టు వేయించుకోవడం ఏంటి..?

సుధీర్ అంటే ఆ యువతికి అంత పిచ్చా.. మరి అక్కడ పచ్చబొట్టు వేయించుకోవడం ఏంటి..?

by Sravanthi
Ad

బుల్లితెర స్టార్ గా పేరొందిన సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇండస్ట్రీ లోకి రావడానికి ఎంత కష్టపడ్డారో మన అందరికీ తెలుసు. ముందుగా మెజీషియన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్, మెల్లి మెల్లిగా జబర్దస్త్ కామెడీ షో లో తనదైన పెర్ఫార్మెన్స్ తో మంచి స్టార్ గా మారాడు. ప్రస్తుతం బుల్లితెరపై చాలా షోలలో ఆయన చేస్తున్నారు. టీవీ షోలోనే కాకుండా ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా కూడా సుధీర్ నటిస్తున్నారు. అలాంటి సుధీర్ కు ఎంతో మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

మెజీషియన్ గా, కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా దేనిలో తక్కువ కాకుండా అన్ని క్యారెక్టర్లు కలగలిపిన వ్యక్తి సుధీర్. ఈ విధంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుదీర్ కు అబ్బాయిల కంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో ఏకంగా ఒక యువతి సుధీర్ పేరును తన శరీరంపైనే పచ్చబొట్టు వేయించుకుంది. సుధీర్ అంటే తనకు ఎంతో అభిమానం అని, పిచ్చి అని సుధీర్ ని అసలు మర్చిపోలేక పోతున్నానని అందుకే పచ్చబొట్టు వేయించుకున్నానని చెబుతోంది ఆ యువతి.

Advertisement

Advertisement

పచ్చబొట్టు వేయించుకోవడమే కాకుండా సుధీర్ అంటే నాకు ఎంతో క్రేజ్ ఉందని, నా కలల రాకుమారున్ని మర్చిపోలేక పోతున్నానని నేను ఎక్కడ ఉన్నా, ఏం పని చేస్తున్నా సుధీర్ గుర్తుకు వస్తున్నాడని చెబుతోంది. దీంతో ఆ యువతిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్ కు ఆ యువతి చెప్పిన మాటలు వింటే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రీతి అనే యువతి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ఈ విషయాలు చెప్పడంతో ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ముందు నీ దృష్టంతా చదువు పై పెట్టు అని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా బారిన పడడంతో ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది.

ALSO READ;

జ్యోతిక‌తో తొలి ప‌రిచ‌యం ఎలా అయిందో చెప్పిన సూర్య‌..ఆ సినిమా త‌రువాతే ప్రేమలో ప‌డ్డారా..?

న‌టి మీన భ‌ర్త ఆక‌స్మిక మ‌ర‌ణం.. విషాదంలో సినిమా ఇండ‌స్ట్రీ..!

Visitors Are Also Reading