నేడు సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు టీటీడీ టికెట్ లను విడుదల చేయనుంది.
Advertisement
నేడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కు విపక్షాల ఎంపీలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు హజరుకాబోతున్నారు.
నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం జరగనుంది. నేడు, రేపు బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లను విక్రయించనున్నారు.
రాజధాని అభివృద్ధి నిధుల కోసం సీఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలనే సీఆర్‌డీఏ ప్రతిపాదనకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహారాష్ట్రలో 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. వారికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది.
Advertisement
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మిథాలీ రాజ్ దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో ఒకరు అని అన్నారు. ఎంతో మందికి మితాలి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఆటకు వీడ్కోలు పలికిన ఆమెకు మంచి జరగాలని కోరుకున్నారు.
అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ కుటుంబం చేతిలో కబ్జా అయిందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అధికారం ఇస్తే పేద కుటుంబాలకు ఎకరం భూమిని అందిస్తామని ప్రకటించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది నిండుకుండలా మారింది. వరద నీరు పోటెత్తడం తో నీరు నీటిమట్టం వరకు చేరింది. దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
టెట్ ఫలితాలు ముందుగా ప్రకటించినట్టుగా 24వ తేదీన విడుదల చేయడం లేదని కన్వీనర్ రాధా రెడ్డి తెలిపారు. ఫలితాల విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని అన్నారు.