స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా కంటే ముందు బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప హిట్ తో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హాట్రిక్ నమోదయింది. నిజానికి పుష్ప సినిమా ను మొదట ఒకే పార్ట్ గా విడుదల చేయాలని షూటింగ్ ప్రారంభించారు.
Advertisement
కానీ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కథను బట్టి సుకుమార్ రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. పుష్ప పార్ట్ 1 ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఆగస్టులో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
సెకండ్ పార్ట్ లో రష్మిక చనిపోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదె లే అంటూ డైలాగ్ చెబుతాడు అన్న సంగతి తెలిసిందే. ఆ డైలాగ్ మరియు అల్లు అర్జున్ మ్యానరిజం సినిమాలో ఎంతగానో పాపులర్ అయ్యాయి. దేశ విదేశాలకు చెందిన క్రికెటర్లు సైతం పుష్ప రాజ్ మ్యానరిజం ను అనుకరిస్తూ ఆ డైలాగ్ ను చెప్పారు.
ఇక ఈ డైలాగ్ ను పుష్ప పార్ట్ 2 నుండి లేపెస్తున్నట్టు సమాచారం. సుకుమార్ పార్ట్ 2 కోసం కొత్త మ్యానరిజం మరియు డైలాగ్స్ సెట్ చేసే పనిలో ఉన్నారట. మరోవైపు బన్నీ కూడా చిత్తూరు యాస నేర్చుకున్నట్టు సమాచారం. అయితే దీని పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు…. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే పార్ట్ 2 వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.