ఐరోపాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జర్మనీ ప్రస్తుతం గ్యాస్ కష్టాలను ఎదుర్కుంటుంది. తొలి నుండి గ్యాస్ దిగుమతిపై రష్యాపై ఆధారపడుతూ వస్తుంది జర్మనీ. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించినప్పటి నుండి గ్యాస్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నది. రష్యాపై అమెరికా సహా ఐరోపా దేశాలు మూకుమ్మడిగా ఆంక్షలు విధించడంతో పుతిన్ సైతం ప్రతిదాడిగా గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రష్యా నుంచి గ్యాస్ సరఫరా స్తంబించిపోవడంతో జర్మనీ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ఇక జర్మనీ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది.
ఆ దేశంలో గ్యాస్ కొరత తీవ్రతరం కావడంతో జర్మనీ అప్రమత్తం అయింది. దేశంలో గ్యాస్ వినియోగాన్ని పరిమితం చేసే మూడు దశల ప్రణాళికల్లో రెండవ ఫేజ్‌ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పరిశ్రమలకు, గృహాలకు సరఫరా చేసే గ్యాస్ ధరను పెంచేందుకు సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలకు జర్మనీ ప్రభుత్వం అనుమతించినట్టయింది. ఫేజ్-2 అమలు వల్ల గ్యాస్ ధరలు పెరిగి గ్యాస్ వినియోగం తగ్గుతుందని జర్మనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి అదనంగా రూ.15.76 బిలియన్ డాలర్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Advertisement
Advertisement
ముఖ్యంగా జర్మనీలో గ్యాస్ సంక్షోభం తలెత్తడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన కారణం అని ఆదేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సరఫరాలో కోత విధించడం జర్మనీపై పుతిన్ చేస్తున్న ఆర్థిక దాడిగా ఆయన అభివర్ణించారు. ధరలను అమాంతం పెంచి అభద్రత భావాన్ని సృష్టించాలని పుతిన్ చూస్తున్నట్టు మండిపడ్డారు. ఇక గ్యాస్ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు.
Also Read :
“విక్రమార్కుడు” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా..? ఆ సినిమా గనక చేసి ఉంటే…!